టాలీవుడ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ తాజాగా దర్శకత్వం వహించిన సినిమా హనుమాన్( Hanuman Movie ) ఇందులో తేజా సజ్జా( Teja Sajja ) హీరోగా నటించిన విషయం తెలిసిందే.సంక్రాంతి పండుగ కానుకగా విడుదలైన ఈ సినిమా సరికొత్త రికార్డులు సృష్టించింది.
రియల్ సూపర్ హీరో అయిన ఆంజనేయ స్వామి నేపథ్యంతో రూపొందిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా వచ్చింది.దీనికి ఆరంభంలోనే పాజిటివ్ టాక్ రావడంతో ప్రేక్షకుల నుంచి స్పందన కూడా భారీ స్థాయిలోనే లభించింది.
ఫలితంగా ఈ చిత్రానికి అదిరిపోయే ఓపెనింగ్స్ కూడా లభించాయి.

దాదాపుగా 300 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి సరికొత్త రికార్డులు సృష్టించింది.కాగా తక్కువ బడ్జెట్‌తోనే వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.అయితే ఇప్పటికే థియేటర్ లలో ఈ సినిమాని చూసిన ప్రేక్షకులు ఓటీటీలో ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.
అయితే ప్రేక్షకులకు షాక్ ఇస్తూ ఈ చిత్రం ఓటీటీ కన్నా ముందు టీవీలో ప్రసారం కానుండటం విశేషం.మార్చి 16న రాత్రి 8 గంటలకు కలర్స్ సినీప్లెక్స్ ఛానల్, జియో సినిమాలో కేవలం హిందీలీ హనుమాన్ మూవీ టెలికాస్ట్ అవుతుంది.

ఈ వివరాలను కలర్స్ సినీప్లెక్స్ సంస్థ తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.ఈ ట్వీట్‌ను డైరెక్టర్ ప్రశాంత్( Prasanth Varm ) వర్మ రీట్వీట్ చేయడంతో తెలుగు ఆడియన్స్‌కి తెలిసింది.నిజానికి మొదట్లో మార్చి 2 నుంచి జీ 5 లో హనుమాన్ స్ట్రీమింగ్ అవుతుందంటూ ప్రచారం జరిగింది.ఆ తర్వాత మార్చి 8న విడుదలవుతుందంటూ టాక్ నడిచింది.
కానీ శివరాత్రికి స్ట్రీమింగ్ అవ్వకపోవడంతో ఆడియన్స్ నిరుత్సాహపడిపోయారు.కొందరు అభిమానులు సోషల్ మీడియాలో జీ5 ను ట్యాగ్ చేస్తూ హనుమాన్ సినిమా ఎప్పుడొస్తుందంటూ అడిగారు.
దీనిపై స్పందించిన జీ5 విడుదల తేదీపై నిర్ణయం తీసుకోలేదంటూ చెప్పుకొచ్చింది.దీంతో హనుమాన్ ఓటీటీ రిలీజ్ డేట్‌పై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది.