సినిమా ఇండస్ట్రీలో ఉన్న దర్శకులందరిలో కృష్ణవంశీని క్రియేటివ్ డైరెక్టర్ అని పిలిచేవారు.ఎందుకంటే ఆయన చేసిన ప్రతి సినిమా కూడా చాలా ఎఫెక్టివ్ గా ఉండేది.
నార్మల్ దర్శకులతో పోలిస్తే ఆయన సినిమాల్లో ఉండే హీరోగాని, కథ గాని చాలా కొత్తగా ఉండటమే కాకుండా ప్రతి సీన్ లో సినిమాకు సంబంధించిన థీమ్ ను ఎక్స్ప్లెయిన్ చేస్తూ సినిమాని చేయడంలో ఆయనను మించిన వారు ఇండస్ట్రీలో లేరు అని చెప్పడం ఎంత మాత్రం అంత శక్తి లేదు.
ఇక ఇదిలా ఉంటే కృష్ణవంశీ( krishna vamsi ) దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా వచ్చిన మురారి( Murari ) సినిమాలో సోనాలి బింద్రే హీరోయిన్ గా నటించింది… ముందుగా ఈ పాత్ర కోసం కృష్ణవంశీ అమీషా పటేల్( Ameesha Patel ) ని తీసుకుందాం అనుకున్నాడు అయినప్పటికీ అమీషా పటేల్ బాలీవుడ్ సినిమాల్లో బిజీగా ఉండడం వల్ల తను ఈ సినిమాలో చేయలేకపోయింది.కానీ ఈ సినిమాను మిస్ చేసుకున్నందుకు తను చాలా బాగా బాధపడినట్టుగా అప్పట్లో మీడియాలో చాలా వార్తలైతే వచ్చాయి.ఇక ఈ సినిమా కు ముందే తను పవన్ కళ్యాణ్ తో బద్రి అనే సినిమా చేసి మంచి సక్సస్ ను అందుకుంది.
అయితే మురారి సినిమాలో తను ఈ పాత్రని కాదనడంతో హీరోయిన్ గా కృష్ణవంశీ సోనాలి బింద్రే( Sonali Bindre ) ని తీసుకున్నాడు.
సోనాలి బింద్రే మహేష్ బాబు( Mahesh Babu ) జంట కూడా చక్కగా ఉందని ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ చెప్పడం అప్పట్లో ఈ సినిమాకి సంబంధించిన ఒక గుడ్ కాంప్లిమెంట్ అనే చెప్పాలి.ఇక అమీషా పటేల్ మురారి సినిమాను రిజెక్ట్ చేసిన కూడా నాని సినిమాలో మహేష్ బాబు పక్కన నటించింది.కానీ ఆ సినిమా భారీ డిజాస్టర్ అయింది.
మురారి సినిమా మాత్రం మంచి సక్సెస్ ని అందుకుంది.ఒకవేళ అమీషా పటేల్ మురారి సినిమాలో మహేష్ బాబు పక్కన నటించి ఉంటే తన ఖాతాలో ఒక మంచి సక్సెస్ అయితే వచ్చేది…
.