భారతదేశంలో చాలా మంది తల్లిదండ్రులు కుమార్తె( Daughter ) కంటే కొడుకును కనడానికే ఇష్టపడతారు.కట్నాలు, రక్షణ, పెంపకం, భద్రత, ఇలా రకరకాల కారణాలవల్ల తల్లిదండ్రుల్లో మగపిల్లాడే పుట్టాలనే ఒక చెడ్డ కోరిక ఏర్పడింది.
నిజానికి అమ్మాయిలు అబ్బాయిల కంటే బాగా చదువుతారు, తల్లిదండ్రులను ఆప్యాయంగా చూసుకుంటారు.కానీ పేరెంట్స్ కొడుకు ఇంటి పేరును, వారసత్వాన్ని కొనసాగించగలడని, వృద్ధాప్యంలో తమను ఆదుకుంటాడని నమ్ముతుంటారు.
కట్నం, కుమార్తె భద్రత విషయంలో బాగా ఆందోళనగా ఉండేవారు కానీ ఇప్పుడా పరిస్థితి చాలా వరకు మారిపోయింది.
ఆడపిల్లలు కూడా విలువైనవారని, ప్రేమకు, గౌరవానికి అర్హులని ఎక్కువ మంది గ్రహిస్తున్నారు.
వారు భారం కాదు, బ్లెస్సింగ్స్ అని నమ్ముతున్నారు.అమ్మాయిలు కూడా జీవితంలో విజయం సాధించగలరని, స్వతంత్రంగా ఉండగలరని విశ్వసిస్తున్నారు.
వారు ఆడపిల్లలు ఇంటి ‘లక్ష్మిదేవి’ కావచ్చని సంతోషపడుతున్నారు.వీటన్నిటికీ ఒక మంచి ఉదాహరణగా ఒక ఫ్యామిలీ సెలబ్రేషన్స్( Family Celebrations ) నిలుస్తున్నాయి.
ఇంటర్నెట్లో ఆ ఫ్యామిలీ సెలబ్రేషన్స్ కి సంబంధించిన ఓ ఫోటో వైరల్ గా మారింది.
ఈ ఫ్యామిలీ తమకు బేబీ గర్ల్( Baby Girl ) పుట్టిన సందర్భంగా వీధి మొత్తాన్ని గులాబీ రంగు బెలూన్లతో( Pink Balloons ) అలంకరించారు.తమ ఆడబిడ్డను స్వాగతించడం పట్ల వారు చాలా సంతోషంగా, గర్వంగా ఫీలయ్యారు.ఈ ఫోటోను @Supriyaaa నైట్ ట్విట్టర్ యూజర్ పంచుకున్నారు.
చిత్రాన్ని ఎక్కడ తీశారో చెప్పలేదు, కానీ ఇందులో కనిపించిన ఓ కారు నంబర్ ప్లేట్‌పై ‘UP 16’ అని రాసి ఉంది.ఇది ఉత్తరప్రదేశ్‌లోని ( Uttar Pradesh ) నోయిడా నగరానికి చెందినదని దీని అర్థం.
చాలా మంది ఈ ఫోటోను లైక్ చేసి కామెంట్ చేశారు.ఇది చాలా మధురంగానూ, హృదయానికి హృద్యంగానూ ఉందన్నారు.కుటుంబ సభ్యుల సానుకూల దృక్పథాన్ని కొనియాడారు.కొంతమంది స్వంత కథలను కూడా పంచుకున్నారు.ఆడపిల్ల పుట్టినప్పుడు కొంచెం బాధగా అనిపించిందని ఒక వ్యక్తి తెలిపాడు, తన అమ్మమ్మ ఏడ్చిందని కూడా చెప్పాడు.కానీ ఆడపిల్ల పుడితే సెలబ్రేట్ చేసుకోవాలని ఈ పిక్ చూశాక తాను అర్థం చేసుకున్నట్లు తెలిపాడు.
ఆడబిడ్డ తల్లిదండ్రులు ఆమెను ఎంతో ప్రేమిస్తారని మరో వ్యక్తి కామెంట్ చేశాడు.ఈ ఫొటోకి 24 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి దీనికి మీరు కూడా చూడండి.