Anil Ravipudi :నన్ను చదివించడం కోసం మా నాన్న రోజు 20 గంటలు పని చేసేవారు : అనిల్ రావిపూడి

అనిల్ రావిపూడి( Anil Ravipudi ) ప్రకాశం జిల్లాలోని చిలుకూరి వారి పాలెం అనే ఒక చిన్న గ్రామంలో వ్యవసాయం చేసుకునే కుటుంబంలో పుట్టాడు.ఈరోజు టాలీవుడ్ లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ డైరెక్టర్ గా ఉన్న అనిల్ రావిపూడి చిన్నతనంలో తండ్రి తనకోసం పడిన కష్టాలను కల్లారా చూసాడు.

 Anil Ravipudi About His Father Struggles To Raise Him-TeluguStop.com

ఎంత కష్టం వచ్చినా తనను చదివించడం కోసం తండ్రి పడిన తాపత్రయం ఇప్పటికి తన కళ్ళ ముందు ఉంటుందని పలుమార్లు అనిల్ చెబుతూ ఉంటారు.అనిల్ రావిపూడి తండ్రి మొదట్లో వ్యవసాయం చేసేవారు.

ఆ తర్వాత ఆయనకు ఆర్టీసీలో ఉద్యోగం( RTC ) రావడంతో రోజుకు దాదాపు 15 నుంచి 20 గంటల పాటు డ్యూటీ చేయాల్సి వచ్చేది.ఆ సమయంలో కేవలం 4000 రూపాయల జీతంతో కుటుంబాన్ని వెళ్లదీశాడట అనిల్ తండ్రి.

చాలీచాలని జీతంతో కుటుంబాన్ని నడిపించడానికి ఆయన అనేక కష్టాలను అనుభవించారట.

Telugu Anil Ravipudi, Anilravipudi, Arun Prasad, Bhagwant Kesari-Movie

అద్దంకిలోతన చిన్నతనం మొత్తం గడిచింది అనిల్ కి.అలాగే తర్వాత ఇంజనీరింగ్ చేయించాలని 45 వేల రూపాయలతో పేమెంట్ సీట్ కట్టి మరీ జాయిన్ చేయించారట.4000 జీతంతో 45 వేల ఫీజు కట్టలేదని తెలిసి కొడుకు కోసం కేబుల్ టీవీ కనెక్షన్స్ ఇవ్వడం కూడా మొదలుపెట్టారట.ఓ పక్క వ్యవసాయం మరో పక్క కేబుల్ టీవీ పనులు అవి కాకుండా ఆర్టీసీ డ్రైవర్ ఉద్యోగం అన్ని చేసినా కూడా చాలా ఇబ్బందులను చూడాల్సి వచ్చేదట.ఆ తర్వాత ఇంజనీరింగ్ పూర్తి చేసి తన తండ్రి కోరిక పూర్తిచేసిన ఉద్యోగం చేసి కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉంటాడని అంతా భావించారట.

Telugu Anil Ravipudi, Anilravipudi, Arun Prasad, Bhagwant Kesari-Movie

తన బాబాయి అరుణ్ ప్రసాద్( Arun Prasad ) లాగా అనిల్ రావిపూడి మాత్రం సినిమా ఇండస్ట్రీకి రావాలనుకున్నారు.పవన్ కళ్యాణ్ తీసిన తమ్ముడు సినిమాకు అరుణ్ ప్రసాద్ డైరెక్టర్ గా పని చేశాడు.ఇక ఇండస్ట్రీకి రావడానికి ఒక దారైతే దొరికింది కదా అని అరుణ్ ప్రసాద్ దగ్గరే అసిస్టెంట్ గా పని చేశాడు.కొన్నాళ్ల పాటు రచయితగా కూడా మారాడు.

అనేక సినిమాలకు మాటలు రాసి పటాస్ సినిమాతో దర్శకుడుగా తన ప్రయాణాన్ని మొదలు పెట్టాడు.నాటి పటాస్ నుంచి నేడు భగవంత్ కేసరి సినిమా ( Bhagwant Kesari movie )వరకు అపజయాలు ఎరుగని ఒక దర్శకుడిగా రాజమౌళి తర్వాత టాలీవుడ్ లో అనిల్ రావిపూడి నిలబడ్డాడు అంటే అది తన తండ్రి పడిన కష్టానికి ఫలితం అంటూ ఉంటాడు అనిల్.

మనల్ని నడిపించేది ఎల్లప్పుడూ కుటుంబం మాత్రమే.కుటుంబం కోసం ఎంత కష్టపడినా అది ఎంతో ఆనందాన్ని ఇస్తుంది.

తండ్రి పడే కష్టం ముందు పిల్లలు సంపాదించేది ఏ మాత్రం సరిపోతుంది.ఎంత చేసినా తండ్రి కష్టానికి తూగే ఫలితాలను అందించగలమా ? అందుకే మనకున్న కుటుంబాన్ని మనం ఎప్పుడూ కాపాడుకుంటూ ఉండాలి.తండ్రి కష్టానికి విలువ ఇచ్చి కాపాడుకోవాలి అని అనిల్ రావిపూడి తన తండ్రి గురించి గొప్పగా మాట్లాడుతూ ఉంటాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube