మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ( Varun Tej ) త్వరలోనే ఆపరేషన్ వాలంటైన్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.ఈ సినిమా మార్చి 1వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఈ సినిమాలో వరుణ్ సరసన మానుషీ చిల్లర్ నటిస్తున్నారు.
ఎయిర్ ఫోర్స్ బ్యాక్ గ్రౌండ్ లో తెరకేక్కినటువంటి ఈ సినిమా త్వరలోనే విడుదల కానున్న తరుణంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేశారు ఈ క్రమంలోనే వరుణ్ తేజ్ వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.
ఇక ఈయన ఇటీవల నటి లావణ్య త్రిపాఠిని ( Lavanya Tripathi ) పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే ఈయన ఏ ఇంటర్వ్యూకి వెళ్లిన తన వ్యక్తిగత విషయాల గురించి కూడా ప్రశ్నలు ఎదురవుతున్నాయి.వరుణ్ లావణ్యల వివాహం ఇటలీలో ( Italy ) జరిగిన సంగతి తెలిసిందే.
ఇలా వీరిద్దరు డెస్టినేషన్ వివాహం చేసుకున్నారు.ఈ వివాహ వేడుకలో కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు.
అయితే తాజాగా వరుణ్ కు తమ పెళ్లి ఇటలీలో జరగడానికి కారణం ఏంటి అనే ప్రశ్న ఎదురయింది.
ఈ ప్రశ్నకు వరుణ్ తేజ్ సమాధానం చెబుతూ.మేము ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్( Destination Wedding ) చేసుకోవడానికి పెద్దగా కారణాలు లేవు ఇండియాలో అయితే గెస్ట్లు ఎక్కువగా ఉంటారు.అమ్మ నాన్న వచ్చిన వారందరిని రిసీవ్ చేసుకోవడానికి వారికి టైం సరిపోతుంది మా పెళ్లిని చూడటానికి వాళ్లకు కుదరదు.
అలాగే మా పెళ్లి ని ఎంజాయ్ చేయడానికి కూడా మా ఫ్యామిలీకి ఏ మాత్రం అవకాశం ఉండదు.అందుకే ఇటలీలో కుటుంబ సభ్యుల సమక్షంలో మాత్రమే మా వెడ్డింగ్ ప్లాన్ చేసుకున్నామని అక్కడ ప్రతి ఒక్కరు కూడా మా పెళ్లిని ఒక వెకేషన్ లా ( Vacation )ఎంజాయ్ చేయాలన్న ఉద్దేశంతోనే అక్కడ పెళ్లి చేసుకున్నాము అంటూ వరుణ్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.