Bangalore : వీడియో: కారు డోరు ఇలా ఓపెన్ చేస్తున్నారా.. చాలా డేంజర్..

రోడ్లపై ప్రయాణాలు చేస్తున్నప్పుడు అనునిత్యం చుట్టుపక్కల పరిశీలిస్తూ ఉండాలి.గుడ్డిగా ఎలా పడితే అలా వెళ్తే చివరికి ప్రమాదాల్లో పడవచ్చు.

 Bangalore : వీడియో: కారు డోరు ఇలా ఓపెన-TeluguStop.com

రోడ్లపై ఉన్నప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించి ముందు అడుగులు వేయాలి.ముఖ్యంగా కారు డోర్లు తెరిచేటప్పుడు ముందు, వెనకా ఏవైనా వాహనాలు వస్తున్నాయా? డోరు ఆ వాహనాలకు తగులుతుందా లేదా అనేది చూసుకోవాలి.కానీ ఓ మహిళా ప్రయాణికురాలు వెనక్కి చూడకుండా క్యాబ్ డోర్ తీసి ప్రమాదానికి కారణమైంది.ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ వీడియో ఫిబ్రవరి 7న డాష్‌క్యామ్ ( Dashcam )ద్వారా రికార్డ్ అయింది.బెంగళూరులో ( Bangalore ) రద్దీగా ఉండే కూడలి మధ్యలో ఒక మహిళ క్యాబ్‌కి కుడివైపు తలుపును తెరుస్తున్నట్లు వీడియోలో కనిపించింది.

అటుగా వెళ్తున్న ఆటో రిక్షా డోర్‌ను ఢీకొని దెబ్బతింది.ఆ మహిళ ఈ ప్రమాదానికి కారణమైన సరే కనీసం క్షమాపణలు చెప్పకుండా ప్రశాంతంగా వెళ్ళిపోయింది.

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ అయిన ఎక్స్‌లో వీడియో పోస్ట్ చేశారు.దాన్ని పోస్ట్ చేసి పేజీ పేరు థర్డ్ ఐ( third eye ).“క్యాబ్‌లో ప్రయాణిస్తున్న ఒక మహిళ రోడ్డు మధ్యలో కారు డోర్ ఓపెన్ చేసింది, దానిని ఆటో వచ్చి ఢీకొట్టింది.ఢీకొన్నప్పటికీ, ఏమీ జరగనట్లుగా ఆమె ప్రశాంతంగా వెళ్ళిపోయింది.ఈ ఘటన డాష్‌క్యామ్ ఫుటేజీలో రికార్డు అయింది.” అని ఈ వీడియోకు ఒక క్యాప్షన్ రాశారు.

ఈ దుర్ఘటనకు కారకులు ఎవరన్న దానిపై చాలా మందికి భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు.మహిళ అజాగ్రత్తగా ఉందని, తలుపు తెరిచే ముందు తనిఖీ చేయాలని కొందరు భావిస్తున్నారు.వెనుక నుంచి వాహనాలు వస్తున్నప్పుడు కుడివైపు తలుపులు తెరిస్తే ప్రమాదమని మరికొందరు హెచ్చరించారు.ఒక నెటిజన్ మాత్రం ఇది డ్రైవర్ తప్పిదమేనని అన్నారు.డ్రైవర్ క్యాబ్‌ను రోడ్డుకు ఎడమవైపు పార్క్ చేసి, ప్రయాణికుడిని ఎడమ తలుపు నుంచి బయటకు రమ్మని కోరితే బాగుండేదని అన్నారు.వెనుక ట్రాఫిక్ గురించి డ్రైవర్ సదరు మహిళను హెచ్చరించి ఉండాల్సిందని ఇంకొందరు అన్నారు.

కారు డోరు ఎలా తెరవకూడదో ఈ వీడియో చూసి నేర్చుకోవాలని మరికొందరు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube