రైతులు ఏ పంటను సాగుచేసిన ఆ పంట సాగు విధానంపై అవగాహన కల్పించుకుని కొన్ని మెళుకువలను పాటించి సాగు చేస్తే ఆశించిన స్థాయిలో దిగుబడులను పొందే అవకాశం ఉంటుందని వ్యవసాయ క్షేత్రం నిపుణులు చెబుతున్నారు.కొంతమంది రైతులు( Farmers ) ఒకే రకమైన పంటలు కాకుండా రకరకాల పంటలను సాగు చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.
ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో జామ తోటల సాగు( Guava Cultivation ) విస్తీర్ణం ప్రతి ఏడాది పెరుగుతోంది.ఒకసారి నాటితే చాలా సంవత్సరాల పాటు పంట దిగుబడులు ఇచ్చేవే పండ్ల తోటలు.
జామ తోటలు నాటిన రెండు లేదా మూడు సంవత్సరాలకే దిగుబడులు ఇవ్వడం మొదలుపెడతాయి.ప్రస్తుతం జామ తోటలు సాగు చేస్తున్న రైతులు తర్వాతి ఏడాది పంట దిగుబడిని పెంచుకోవడం కోసం ఈ సమయంలో కొన్ని యాజమాన్య పద్ధతులు చేపట్టాలి.
జామ తోటలు సాగు చేస్తే ఏడాదికి మూడుసార్లు పంట చేతికి వస్తుంది.ప్రస్తుతం శీతాకాలం పంట పూర్తయింది.కొన్ని యాజమాన్య పద్ధతుల లోపాల వల్ల దిగుబడులు తగ్గుతున్నాయి.

మరి దిగుబడులు పెంచాలంటే.ఫిబ్రవరి నుండి మే వరకు నీటి తడులు ఆపాలి.ఇప్పుడు జామ తోట నీటి ఎద్దడికి గురవుతుంది.
జూన్ మొదటి వారంలో జామ తోటకూ నీటి తడిని అందించి ఎరువులు వేయాలి.ఐదు సంవత్సరాల వయసు ఉండే ప్రతి జామ చెట్టుకు 500 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్,( Muriate of Potash ) 500 గ్రాముల యూరియా( Urea ) అందించాలి.
పొలంలో కలుపు మొక్కలు లేకుండా మొత్తం తొలగించి, అంతర కృషి చేపట్టాలి.ఏవైనా జామ చెట్టు మొక్కలకు కాయాలు అయితే ఆ మొక్కకు కొమ్మ కత్తిరింపులు చేయాలి.

జామకాయలు నిమ్మకాయ సైజులో ఉన్నప్పుడు ఒక లీటరు నీటిలో 10 గ్రాముల పొటాషియం నైట్రేట్ ను కలిపి మొక్కలు పూర్తిగా తడిచేటట్లు పిచికారి చేయాలి.జామ చెట్లకు సూర్యరశ్మితో పాటు గాలి బాగా తగిలేటట్లు, పొలంలో నీరు నిల్వ ఉండకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి.ఏవైనా చీడపీడలు లేదంటే తెగుళ్లు ఆశిస్తే ఆలస్యం చేయకుండా తొలిదశలోనే అరికట్టాలి.అధిక ప్రాధాన్యం సేంద్రియ ఎరువులకు మాత్రమే ఇవ్వాలి.సేంద్రియ ఎరువుల వాడకం పెరిగితే నేల సారవంతం పెరుగుతుంది.