డైరెక్టర్ ప్రశాంత్ వర్మ( Prasanth varma ).గత కొద్దిరోజులుగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో అలాగే సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న పేర్లలో ఈ పేరు కూడా ఒకటి.
హనుమాన్ సినిమా ఏ ముహూర్తాన విడుదల అయిందో కానీ అప్పటినుంచి దర్శకుడు ప్రశాంత్ వర్మ పేరు పాన్ ఇండియా రేంజ్ లో మారుమోగిపోతోంది.ఈ సినిమా విడుదల ఇన్ని రోజులు అవుతున్నా కూడా ఇంకా ఈ సినిమా మీడియా తగ్గడం లేదు.
ఈ సినిమాతో పాటు వదిలిన సినిమాలు ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతుండగా ఈ సినిమా మాత్రం ఇంకా థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా ప్రదర్శితమవుతోంది.

కాగా హనుమాన్ సినిమాతో సంచలనం రేపి, కాన్ఫిడెన్స్‌కి కేరాఫ్ అడ్రస్‌లా నిలిచారు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.తక్కువ బడ్జెట్ లోనే హనుమాన్ సినిమా( hanuman movie)ను ఒక విజువల్ వండర్ లా తెరకెక్కించి అందరితోనూ శభాష్ అనిపించుకున్నారు.

ఇక హనుమాన్ సినిమాకు కొనసాగింపుగా జై హనుమాన్ సినిమా రాబోతున్నట్లు కూడా ఇప్పటికే దర్శకుడు ప్రకటించారు. ఆ సినిమాతో పాటు మరికొన్ని భారీ చిత్రాలు చేయడానికి ప్రశాంత్ ప్రణాళికలు రచించుకున్నాడు.కాగా అతను పురాణ గాథలు తీయడానికి రెడీ అయితే వెయ్యి కోట్ల పెట్టుబడి పెట్టడానికి ఒక నిర్మాత రెడీ అయ్యాడట.
హనుమాన్ పోస్ట్ రిలీజ్ ప్రమోషన్లలో భాగంగా మీడియాకు వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు ప్రశాంత్.

అందులో భాగంగానే అతనీ విషయం వెల్లడించాడు.పురాణ గాథలతో సినిమాలు తీస్తానంటే వెయ్యి కోట్లు పెట్టుబడి పెట్టడానికి తాను సిద్ధం అంటూ ఒక ఎన్నారై తనకు ఆఫర్ ఇచ్చినట్లు ప్రశాంత్ వర్మ తెలిపారు.రామాయణం, మహాభారత గాథలను నేను తీయాలనుకున్నాను.
రాజమౌళి( Rajamouli ) మహాభారతం తీస్తానన్నాడు కాబట్టే ఆ ఆలోచన విరమించుకున్నాను.బాలీవుడ్ దర్శకుడు నితీశ్ తివారి( Nitesh Tiwari ) రామాయణం తీయకపోతే నేనేం తీస్తాను అని ప్రశాంత్ వర్మ ప్రకటించారు.