సాధారణంగా అమ్మాయిలు చాలామంది పొడవైన జుట్టును ఇష్టపడుతూ ఉంటారు.మరికొందరు షార్ట్ హెయిర్ ని కూడా ఇష్టపడతారు.
అమ్మాయిలే కాకుండా అబ్బాయిలు సైతం జుట్టు పై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ ఉంటారు.కానీ ప్రస్తుత కాలంలో యువత తలకు నూనె రాయడం అవసరమా అని భావిస్తున్నారు.
అసలు తలకు నూనె రాయడం మంచిదేనా? నూనెను రాయడం వలన ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.మామూలుగా ప్రతిరోజు తలకు నూనె రాసుకోవడం మంచిదని పెద్దలు చెబుతూ ఉంటారు.
చిన్నతనంలో తలకు నూనె రాసుకుని తిరిగిన వారు కూడా ప్రస్తుతం ఆ విధంగా చేయడం లేదు.ఇప్పుడు నూనె రాయకుండా పొడి జుట్టుతో తిరగడమే ఫ్యాషన్ అనుకుంటున్నారు.

అయితే తలకు నూనె రాయకపోవడం వలన ఎన్నో జుట్టు సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.మరి ముఖ్యంగా జుట్టు రాలిపోవడం, చుండ్రు, కుదుళ్ళు బలహీనంగా మారడం లాంటి సమస్యలు వేధిస్తూ ఉంటాయి.ఈ విధంగా జుట్టు సమస్యలు రాకుండా అందమైన, ఆరోగ్యవంతమైన జుట్టు రావాలంటే తప్పకుండా నూనె పట్టిస్తూ ఉండాలని నిపుణులు కూడా చెబుతున్నారు.జుట్టుకు నూనె రాయడం వలన రక్త ప్రసరణ బాగా జరిగి కుదుళ్లు బలపడతాయి.
దీని వలన జుట్టు స్ట్రాంగ్ గా అవుతుంది.ఇక చుండ్రుతో పాటు, వెంట్రుకలు తెల్లగా( White hair ) మారడం లాంటి సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.
అలాగే తరచూ నూనె రాయడం వలన మంచి మెరుపు వస్తుంది.

దాంతోపాటు జుట్టు పొడిగా మారడం, వెంట్రుకలు రాలిపోవడం లాంటి సమస్యలకు కూడా చెక్ పెట్టవచ్చు.ఈ నేపథ్యంలోనే జుట్టుకు రోజు కాకపోయినా కనీసం వారానికి రెండు లేదా మూడుసార్లు అయినా నూనె రాయడం మంచిదని చెబుతున్నారు.కొబ్బరి, ఆలివ్ ఆయిల్( Olive Oil ) లేదా బాదం, ఉసిరి లాంటి నూనెలను జుట్టుకు పట్టించడం వలన జుట్టు సమస్యలు తగ్గిపోతాయి.
అలాగే రాత్రి పడుకునే ముందు తలకు నూనె బాగా పట్టించి ఉదయమే తలస్నానం చేయడం వలన కూడా మంచి ఫలితాలు ఉంటాయి.ఇలా చేయడం వలన చుండ్రు తగ్గడంతో పాటు, జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.