జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేసిన చైనా ఆర్మీ.. వీడియో వైరల్.. ఏం జరిగిందంటే?

అయోధ్య రామ మందిరంలో( Ayodhya Ram Mandir ) రాముని ప్రాణప్రతిష్ట పూర్తి కాగా బాలరామునికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.రామ మందిరానికి భారీ మొత్తంలో విరాళాలు వచ్చాయి.

 China Army Jai Shriram Slogans Goes Viral In Social Media Details Here , Ayodhya-TeluguStop.com

రామ మందిరంను దర్శించుకోవడానికి సామాన్య భక్తులకు అనుమతులు లభించడంతో ఎక్కువ సంఖ్యలో భక్తులు ఆలయానికి వెళుతున్నారు.అయితే తాజాగా ఒక ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది.

ఇండియన్ ఆర్మీకి చెందిన కొంతమంది చైనా ఆర్మీ( Chinese Army ) సైనికులతో జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేయించగా అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.వాస్తవాధీన రేఖ దగ్గర ఈ ఘటన జరిగిందని తెలుస్తోంది.

రెండు దేశాల ఆర్మీ ఈ వీడియోలో నిలబడి ఉన్నారు.మన దేశానికి చెందిన సైనికులు జై శ్రీరామ్ అనే నినాదాన్ని ఎలా పలకాలో చైనా భద్రతా దళాలకు చెబుతున్నట్టుగా ఆ వీడియోలో ఉంది.

ఒక మాజీ సైనికుడు ట్విట్టర్ వేదికగా ఈ వీడియోను షే చేయగా ఈ వీడియో నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది.అయితే ఈ ఘటన ఎక్కడ జరిగింది? ఎప్పుడు జరిగింది? అనే ప్రశ్నలకు మాత్రం సమాధానం దొరకాల్సి ఉంది.తెలుగు రాష్ట్రాల్లో సైతం రాముని భక్తులు తరచూ జై శ్రీరామ్ నినాదాలు చేస్తున్నారు.అయోధ్య రామ మందిరానికి ఎక్కువ మొత్తం విరాళం ఇచ్చిన హీరోలలో టాలీవుడ్ నుంచి పవన్ కళ్యాణ్ ఉన్నారు.

భారత్ , చైనా ( India , China )మధ్య గత కొంతకాలంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ గా నిలుస్తోంది.అయోధ్య బాలరామునికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.అయోధ్యకు ట్రైన్ల సంఖ్యను పెంచితే బాగుంటుందని సామాన్య, మధ్యతరగతి వర్గాల ప్రజల నుంచి డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube