విశాఖ జిల్లాలోని అరకులో టీడీపీ నిర్వహిస్తున్న ‘ రా కదలి రా’ బహిరంగ సభ జరిగింది.ఈ సభలో పాల్గొన్న ఆ పార్టీ అధినేత చంద్రబాబు( Chandra Babu ) మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
అరకు కాఫీని ప్రపంచానికి పరిచయం చేయాలని చంద్రబాబు తెలిపారు.ఈ క్రమంలో తాము అరకు కాఫీని ప్రమోట్ చేస్తే వైసీపీ( YCP ) గంజాయిని ప్రమోట్ చేస్తోందని పేర్కొన్నారు.
ఇక్కడి పంటలకు గిట్టుబాటు ధర రావడం లేదన్నారు.నమ్మించి గొంతు కోసిన వ్యక్తి జగన్ ( CM Jagan ) అని మండిపడ్డారు.గిరిజనులకు సీఎం జగన్ చేసిందేమీ లేదన్న చంద్రబాబు వారి పథకాలను సైతం రద్దు చేశారని ఆరోపించారు.గిరిజనుల పొట్ట కొట్టే ప్రభుత్వం వైసీపీ అని మండిపడ్డారు.ఈ క్రమంలోనే టీడీపీ వచ్చాక మళ్లీ జీవో నంబర్ 3 ను తీసుకొస్తామని వెల్లడించారు.