అయోధ్యలో పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ ఇవే.. ఒక్కసారి తింటే మర్చిపోలేరు..

హిందువులకు పవిత్రమైన నగరమైన అయోధ్యలో రామ మందిరం( Ayodhya Ram Mandir ) జనవరి 22న ప్రారంభం కానుంది.ఆ రోజు నుంచి రామ మందిరాన్ని సందర్శించేందుకు భారతదేశ నాలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది.

 These Are The Famous Street Food Available In Ayodhya Details, Ayodhya, Ram Mand-TeluguStop.com

అయితే అయోధ్యలో బాల రాముడి సందర్శన చేసుకోవడమే ఇక్కడి స్ట్రీట్ ఫుడ్( Street Food ) రుచి చూసి పర్యాటకులు మైమరిచిపోవచ్చు.ముఖ్యంగా కొన్ని స్ట్రీట్ ఫుడ్స్ ఒకసారి వాటిని రుచి చూస్తే మిమ్మల్ని మీరే మైమరిచిపోవడం ఖాయం.

అవేవో తెలుసుకుందాం.

Telugu Ayodhya, Ayodhya Foods, Ayodhyastreet, Chaat, Dahi Bhalla, Dal Kachori, L

* చాట్

చాట్ ఇండియాలో చాలా ప్రాంతాల్లో దొరుకుతుంది కానీ, అయోధ్యలోని చాట్( Chaat ) రుచి మాత్రం వేరే లెవెల్ లో ఉంటుంది.ఈ నగరంలో స్ట్రీట్ ఫుడ్ వ్యాపారులు చాట్‌ను తయారు చేయడానికి వివిధ రకాల మసాలా దినుసులు ఉపయోగిస్తారు.చాట్‌లో తీపి, పుల్లని చట్నీ, మసాలా చిక్‌పీస్, సుగంధ కొత్తిమీర, ఇతర మసాలా దినుసులను కలపడం ద్వారా ఈ ఐటమ్ టేస్ట్ ను పెంచుతారు.

అయోధ్యలోని చాట్‌ను సాయంత్రం వేళల్లో ఎక్కువగా తినడం జరుగుతుంది.

Telugu Ayodhya, Ayodhya Foods, Ayodhyastreet, Chaat, Dahi Bhalla, Dal Kachori, L

* దాల్ కచోరి

ఉత్తరప్రదేశ్‌లో ఒక పాపులర్ డిష్‌గా దాల్ కచోరి( Dal Kachori ) నిలుస్తోంది.పూరీ, కచోరీలతో ఈ ఐటమ్ నోరూరిస్తుంది.కచోరీలను మూంగ్, మినప పప్పులతో తయారు చేస్తారు.

ఈ ఐటమ్‌ను చట్నీ లేదా వెజిటేబుల్స్‌తో వేడివేడిగా సర్వ్ చేస్తారు.అయోధ్యలోని దాల్ కచోరి టేస్టీ చాలా అద్భుతంగా ఉంటుంది.

Telugu Ayodhya, Ayodhya Foods, Ayodhyastreet, Chaat, Dahi Bhalla, Dal Kachori, L

* దహీ భల్లా

దహీ భల్లా( Dahi Bhalla ) అయోధ్య స్ట్రీట్ ఫుడ్స్‌లో బాగా పాపులర్ అయిన ఒక వంటకం.ఇది పప్పులతో చేసిన వడలు, పెరుగు, తీపి-పుల్లని చట్నీల కలయికతో తయారవుతుంది.చేయబడుతుంది.దహీ భల్లా అయోధ్యలోని ప్రతి వీధిలోనూ దొరుకుతుంది.

Telugu Ayodhya, Ayodhya Foods, Ayodhyastreet, Chaat, Dahi Bhalla, Dal Kachori, L

* రబ్డి

రబ్డి( Rabdi ) అయోధ్యలో దొరికే ఒక పాపులర్ స్వీట్ ఐటమ్.పాలు, చక్కెర, పంచదారతో దీనిని తయారు చేస్తారు.రబ్డిని కుంకుమపువ్వు, వివిధ రకాల డ్రై ఫ్రూట్స్‌తో వడ్డిస్తుంటారు.రబ్డి రుచి చాలా అద్భుతంగా ఉంటుంది.

అయోధ్య స్ట్రీట్ ఫుడ్ చాలా తక్కువ ధరలో లభిస్తుంది.అతి తక్కువ డబ్బుతో ఈ అద్భుతమైన ఐటమ్స్ తినవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube