అయోధ్యలో పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ ఇవే.. ఒక్కసారి తింటే మర్చిపోలేరు..

హిందువులకు పవిత్రమైన నగరమైన అయోధ్యలో రామ మందిరం( Ayodhya Ram Mandir ) జనవరి 22న ప్రారంభం కానుంది.

ఆ రోజు నుంచి రామ మందిరాన్ని సందర్శించేందుకు భారతదేశ నాలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది.

అయితే అయోధ్యలో బాల రాముడి సందర్శన చేసుకోవడమే ఇక్కడి స్ట్రీట్ ఫుడ్( Street Food ) రుచి చూసి పర్యాటకులు మైమరిచిపోవచ్చు.

ముఖ్యంగా కొన్ని స్ట్రీట్ ఫుడ్స్ ఒకసారి వాటిని రుచి చూస్తే మిమ్మల్ని మీరే మైమరిచిపోవడం ఖాయం.

అవేవో తెలుసుకుందాం. """/" / H3 Class=subheader-style* చాట్/h3p చాట్ ఇండియాలో చాలా ప్రాంతాల్లో దొరుకుతుంది కానీ, అయోధ్యలోని చాట్( Chaat ) రుచి మాత్రం వేరే లెవెల్ లో ఉంటుంది.

ఈ నగరంలో స్ట్రీట్ ఫుడ్ వ్యాపారులు చాట్‌ను తయారు చేయడానికి వివిధ రకాల మసాలా దినుసులు ఉపయోగిస్తారు.

చాట్‌లో తీపి, పుల్లని చట్నీ, మసాలా చిక్‌పీస్, సుగంధ కొత్తిమీర, ఇతర మసాలా దినుసులను కలపడం ద్వారా ఈ ఐటమ్ టేస్ట్ ను పెంచుతారు.

అయోధ్యలోని చాట్‌ను సాయంత్రం వేళల్లో ఎక్కువగా తినడం జరుగుతుంది. """/" / H3 Class=subheader-style* దాల్ కచోరి/h3p ఉత్తరప్రదేశ్‌లో ఒక పాపులర్ డిష్‌గా దాల్ కచోరి( Dal Kachori ) నిలుస్తోంది.

పూరీ, కచోరీలతో ఈ ఐటమ్ నోరూరిస్తుంది.కచోరీలను మూంగ్, మినప పప్పులతో తయారు చేస్తారు.

ఈ ఐటమ్‌ను చట్నీ లేదా వెజిటేబుల్స్‌తో వేడివేడిగా సర్వ్ చేస్తారు.అయోధ్యలోని దాల్ కచోరి టేస్టీ చాలా అద్భుతంగా ఉంటుంది.

"""/" / H3 Class=subheader-style* దహీ భల్లా/h3p దహీ భల్లా( Dahi Bhalla ) అయోధ్య స్ట్రీట్ ఫుడ్స్‌లో బాగా పాపులర్ అయిన ఒక వంటకం.

ఇది పప్పులతో చేసిన వడలు, పెరుగు, తీపి-పుల్లని చట్నీల కలయికతో తయారవుతుంది.చేయబడుతుంది.

దహీ భల్లా అయోధ్యలోని ప్రతి వీధిలోనూ దొరుకుతుంది. """/" / H3 Class=subheader-style* రబ్డి/h3p రబ్డి( Rabdi ) అయోధ్యలో దొరికే ఒక పాపులర్ స్వీట్ ఐటమ్.

పాలు, చక్కెర, పంచదారతో దీనిని తయారు చేస్తారు.రబ్డిని కుంకుమపువ్వు, వివిధ రకాల డ్రై ఫ్రూట్స్‌తో వడ్డిస్తుంటారు.

రబ్డి రుచి చాలా అద్భుతంగా ఉంటుంది.అయోధ్య స్ట్రీట్ ఫుడ్ చాలా తక్కువ ధరలో లభిస్తుంది.

అతి తక్కువ డబ్బుతో ఈ అద్భుతమైన ఐటమ్స్ తినవచ్చు.

అవినీతి ఆరోపణల కేసు .. సింగపూర్ భారత సంతతి నేత ఈశ్వరన్‌కు జైలుశిక్ష