రెబల్ స్టార్ అని మిమ్మల్ని ఎందుకు పిలుస్తారు... మొహం మీదే అడిగిన శృతిహాసన్?

సలార్ (Salaar) సినిమా థియేటర్లలో విడుదల దాదాపు వెళ్ళిపోతున్నటువంటి తరుణంలో చిత్రబృందం ప్రమోషన్ కార్యక్రమాలకు సంబంధించిన ఇంటర్వ్యూ విడుదల చేశారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించినటువంటి ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 Shruthi Hassan Interview With Salaar Team, Shruthi Hassan, Prabhas, Social Media-TeluguStop.com

ఈ ఇంటర్వ్యూలో భాగంగా శృతిహాసన్(Shruthi Hassan) ప్రభాస్ (Prabhas ) పృథ్వీ రాజ్(Pruthvi Raj Sukumaaran) సుకుమారన్ ను ఇంటర్వ్యూ చేశారు.ఇంటర్వ్యూ కి సంబంధించిన ఒక వీడియో క్లిప్ హోం బలే ఫిలిం మేకర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా విడుదల చేశారు.

ఇందులో భాగంగా ప్రభాస్ ను ఉద్దేశించి శృతిహాసన్ అడిగినటువంటి ప్రశ్నలకు ఆయన అంతే ఫన్నీగా సమాధానం చెప్పారు.

ప్రభాస్ ని అందరికి కూడా డార్లింగ్(Darling ) అని పిలుస్తూ ఉంటారు అనే సంగతి మనకు తెలిసిందే.అదేవిధంగా యంగ్ రెబల్ స్టార్ (Rebal Star) అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ విషయం గురించి శృతిహాసన్ ప్రభాస్ ని ప్రశ్నించారు నేను సలార్ సినిమా చేసేటప్పుడు అందరూ కూడా డార్లింగ్ తో సినిమా చేస్తున్నావా అంటూ అడిగేవారు నేను కూడా అవును అంటూ సమాధానం చెప్పేదాన్ని కానీ ఈ సినిమా సెట్ లోకి వచ్చిన వారం రోజులకు ప్రభాస్ ని ఎందుకు డార్లింగ్ అని పిలుస్తారో అర్థమైంది అంటూ శృతిహాసన్ మాట్లాడారు.

ఇలా శృతిహాసన్ మాట్లాడుతున్న తరుణంలోనే పృథ్వి కూడా మాట్లాడుతూ నిన్ను డార్లింగ్ అని ఎందుకు పిలుస్తారో నాకు తెలుసు కానీ రెబల్ స్టార్ అని ఎందుకు పిలుస్తారు అంటూ సందేహం వ్యక్తం చేయగా వెంటనే శృతిహాసన్ అవును ఎందుకు నిన్ను రెబెల్ స్టార్ అని పిలుస్తారు అంటూ ప్రశ్నించారు.అందుకు ప్రభాస్ సమాధానం చెబుతూ మా పెదనాన్న కృష్ణంరాజు రెబల్ స్టార్ అందుకే తనని కూడా అలాగే పిలుస్తారు అంటూ ఈయన సమాధానం చెప్పారు ప్రస్తుతం ఇందుకు సంబంధించినటువంటి వీడియో వైరల్ గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube