తెలుగు ప్రేక్షకులకు ఉన్నటుడు బిగ్ బాస్ కంటెస్టెంట్ అమర్‌దీప్ చౌదరి( Amardeep Chaudhary ) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.అమర్‌దీప్ పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చే సీరియల్ జానకి కలగనలేదు.
ఈ సీరియల్ ద్వారా భారీగా పాపులారిటీని సంపాదించుకున్నాడు అమర్‌దీప్.ఈ సీరియల్ తో పాటు తెలుగులో మరిన్ని సీరియల్స్ లో ప్రేక్షకులకు బాగా చేరువైన అమర్‌దీప్, బిగ్ బాస్ షోకి ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులకు మరింత చేరువ అయ్యాడు.
ఇటీవలె తెలుగులో ముగిసిన బిగ్బాస్ సీజన్ 7( Bigg Boss Season 7 ) రన్నరప్ గా నిలిచిన విషయం తెలిసిందే.తప్పకుండా టైటిల్ గెలుస్తాడు అని అందరూ భావించారు.
కానీ ఊహించని విధంగా చివర్లో రన్నరప్ గా నిలిచాడు అమర్‌దీప్.
ఇకపోతే అమర్‌దీప్ హౌస్ లో ఉన్న సమయంలో పల్లవి ప్రశాంత్( Pallavi Prashanth ) అభిమానులు ఆయన భార్య తల్లిని టార్గెట్ చేస్తూ బూతులు తిడుతూ రెచ్చిపోయిన విషయం తెలిసిందే.దాంతో ఆ కామెంట్లతో విసిగిపోయిన అమర్‌దీప్ తల్లి సోషల్ మీడియాలో ఒక వీడియోని షేర్ చేస్తూ బండ బూతులు తిడుతూ పల్లవి ప్రశాంత్ అభిమానులకు గట్టిగా కౌంటర్ ఇచ్చింది.అంతే కాకుండా బిగ్ బాస్ హౌస్ లో అమర్‌దీప్ ఉన్న సమయంలో ఆయనపై సోషల్ మీడియాలో ఎన్నో రకాల ట్రోల్స్ నెగిటివ్ కామెంట్స్ తో పాటు ఎన్నో మీమ్స్ వైరల్ అయ్యాయి.
అలా వందో 200 అనుకుంటే పొరపాటు పడ్డట్టే.39 వేల మీమ్స్ వచ్చాయి.ఇదే విషయం గురించి ఒక ఇంటర్వ్యూలో అమర్‌దీప్ మాట్లాడుతూ నేను హౌస్ లో ఉన్న సమయంలో నా మీద 39 వేల మీమ్స్ వచ్చాయి.ఈ రికార్డుని ఎవరు బ్రేక్ చేయలేరు.
అంతే కాకుండా ఇలాంటి రికార్డు ఇప్పటీ వరకు ఎవరు సృష్టించలేదు అని తెలిపారు అమర్‌దీప్.ఈ సందర్భంగా అమర్‌దీప్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఇకపోతే అమర్తి వ్యక్తిగత విషయానికి వస్తే అమర్దీప్ సీరియల్ నటి తేజస్విని గౌడను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.ఈమె కూడా తెలుగులో ప్రస్తుతం పలు సీరియల్స్ లో నటిస్తూ బిజీ బిజీగా ఉంది.
ప్రస్తుతం అమర్‌దీప్ కూడా పలు సీరియల్స్ లో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నారు.తొందర్లోనే వెండితెరపై పలు సినిమాలలో నటించబోతున్నట్లు కూడా తెలుస్తోంది.