తెలుగు ప్రేక్షకులకు నటి అంజలి( Anjali ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.అచ్చ తెలుగు నటిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది అంజలి.
తెలుగులో ఎన్నో సినిమాలలో నటించి మెప్పించింది.కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళం మలయాళం కన్నడ సినిమాలలో కూడా నటించి అన్ని భాషల్లోనూ ప్రత్యేకంగా ఫ్యాన్స్ బేస్ ని ఏర్పరచుకుంది నటి అంజలి.
ఇప్పటికీ వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతోంది.ఇది ఇలా ఉంటే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అంజలి పలు ఆసక్తికర విషయాలను పంచుకోవడంతో పాటు సినిమాలలోని ముద్దు సన్నివేశాలు,( Kissing Scenes ) ఇంటిమేట్ సన్నివేశాల గురించి తన అభిప్రాయాన్ని వెల్లడించింది.
ఈ సందర్భంగా అంజలి మాట్లాడుతూ.సినిమాల్లో కొన్ని సన్నివేశాల్లో నటించేటప్పుడు సహనటుడు నా గురించి ఏమనుకుంటాడోనని ఆందోళన కలుగుతుంది.ఇంటిమేట్ సన్నివేశాలు సినిమాకు అవసరం కాబట్టి వాటిని నిరాకరించలేను.అసౌకర్యంగానే వాటిల్లో నటిస్తాను నిజ జీవితంలో ఇద్దరు ప్రేమికుల మధ్య ఉండే కెమిస్ట్రీకి సినిమాలో ప్రేమికుల మధ్య ఉండే దానికి చాలా వ్యత్యాసం ఉంటుంది.
అందుకే సహనటులతో ముద్దు సన్నివేశాల్లో నటించేటప్పుడు నాకు ఇబ్బందిగా అనిపిస్తుంది అని తెలిపింది అంజలి.అలాగే తన పెళ్లి విషయాల గురించి వస్తున్న రూమర్స్ పై ఆమె స్పందిస్తూ.
కొందరు నా వ్యక్తిగత విషయాల గురించి వాళ్ల ఇష్టానుసారం ఊహాగానాలు రాస్తారు.జర్నీ నటుడు జైతో( Actor Jai ) నేను ప్రేమలో ఉన్నట్లు కొన్ని రోజులు రాశారు.ఆ తర్వాత అమెరికాకు చెందిన వ్యక్తితో నాకు పెళ్లి ( Anjali Marriage ) అయిపోయిందన్న వార్తలు వచ్చాయి.వాటిని చూసినప్పుడు నా పెళ్లి నాకు తెలియకుండానే చేస్తున్నారని నవ్వుకుంటాను అని నవ్వుతూ చెప్పుకొచ్చింది అంజలి.
ఈ సందర్భంగా ఇంటర్వ్యూలో భాగంగా అంజలి చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.