మిరప పంటకు తీవ్ర నష్టం కలిగించే బూడిద తెగులు నివారణ కోసం చర్యలు..!

మిరప పంట( Chilli crop ) ప్రధాన వాణిజ్య పంటలలో ఒకటి.మిరప పంట సాగు విధానంపై అవగాహన ఉంటే ఆశించిన స్థాయిలో దిగుబడులు పొంది మంచి లాభాలు పొందవచ్చు.

 Actions For The Prevention Of Gray Pest Which Causes Severe Damage To Chilli Cro-TeluguStop.com

ఒకవేళ సరైన అవగాహన లేకుండా మిరప పంటను సాగు చేస్తే.ఏవైనా చీడపీడలు లేదంటే తెలుగులో ఆశిస్తే సకాలంలో వాటిని గుర్తించి అరికట్టడంలో కాస్త ఆలస్యం చేస్తే ఊహించని నష్టం ఎదుర్కోవాల్సిందే.

Telugu Agriculture, Azoxystrobin, Chilli Crop, Farmers, Mirchi, Sulfur-Latest Ne

అయితే ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల మిరప తోటల్లో బూడిద తెగులు ఉధృతంగా వ్యాప్తి చెంది మిరప పంటను తీవ్రంగా నష్టపరుస్తోంది.మిరప పంట ప్రస్తుతం అక్కడ రెండో కోతకు సిద్ధంగా ఉన్న ఈ తరుణంలో బూడిద తెగులు ఆశిస్తున్నాయి.ప్రస్తుతం మారిన వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ బూడిద తెగులు పంటను ఆశిస్తున్నాయి.మిరప తోటల్లో ఈ తెగులు గుర్తించిన తర్వాత మూడు గ్రాములు నీటిలో కరిగే గంధకం( Sulfur ) ను ఒక లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి.

లేదంటే 1మి.లీ అజాక్సీస్ట్రోబిన్( Azoxystrobin ) ను ఒక లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి.

Telugu Agriculture, Azoxystrobin, Chilli Crop, Farmers, Mirchi, Sulfur-Latest Ne

15 రోజుల వ్యవధిలో రెండుసార్లు మిరప మొక్కలు పూర్తిగా తడిచేటట్లు పిచికారి చేస్తే ఈ తెగులను పూర్తిగా నివారించవచ్చు.వాతావరణ పరిస్థితుల వల్ల కొన్ని రకాల చీడపీడలు, తెగుళ్లు పంటను ఆశిస్తాయి.అయితే వీటి కాస్త ఉధృతి తక్కువగా ఉండాలంటే.వివిధ రకాల తెగుళ్లను తట్టుకొని నిలబడగలిగే మేలు రకం విత్తనాలను ఎంపిక చేసుకుని సాగు చేయాలి.మొక్కల మధ్య, మొక్కల వరుసల మధ్య సూర్యరశ్మితో పాటు గాలి బాగా తగిలే విధంగా కాస్త దూరంగా నాటుకోవాలి.వీలైనంతవరకు ఉదయం పూట మాత్రమే పంటకు నీటి తడులు అందించాలి.

ఎప్పటికప్పుడు పొలంలో కలుపు మొక్కలను పీకేయాలి.రెండు లేదా మూడు సంవత్సరాల కు ఒకసారి కచ్చితంగా పంట మార్పిడి చేయాలి.

ముఖ్యంగా పంట కోతల అనంతరం పంట అవశేషాలను పొలం నుంచి పూర్తిగా తొలగించాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube