ఏపీలోని ప్రతిపక్షాలపై ఎంపీ ఆర్.కృష్ణయ్య తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
బీసీలను ప్రలోభాలకు గురి చేయాలని విపక్షాలు చూస్తున్నాయని ఆరోపించారు.
సీఎం జగన్ పాలనలో రాష్ట్రంలోని బీసీలు అందరూ ఆనందంగా ఉన్నారని ఎంపీ ఆర్.కృష్ణయ్య తెలిపారు.జగన్ రాజకీయ నాయకుడు కాదన్న ఆయన జగన్ ఓ సంఘ సంస్కర్త అని కొనియాడారు.
ఈ క్రమంలోనే అడగకుండానే సీఎం జగన్ వరాలు ఇస్తున్నారని పేర్కొన్నారు.బీసీ, ఎస్టీ, ఎస్సీలంతా కలిసి మళ్లీ సీఎంగా జగన్ ను గెలిపించుకోవాలని తెలిపారు.
వైసీపీకి 150కి పైగా సీట్లు వస్తాయని తన సర్వేలో తెలిసిందని వెల్లడించారు.