కాంగ్రెస్ లో వైఎస్ఆర్టీపీ విలీనానికి సర్వం సిద్ధమైంది.ఈ క్రమంలో మరికాసేపటిలో ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే సమక్షంలో వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లో కలపబోతున్నారు.
ఇప్పటికే వైఎస్ షర్మిల ఢిల్లీకి చేరుకున్నారు.ముందుగా కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో వైఎస్ షర్మిల సమావేశం కానున్నారు.
తరువాత ఖర్గే సమక్షంలో ఆమె కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు.అయితే షర్మిలకు కీలక బాధ్యతలు అప్పగించాలని కాంగ్రెస్ భావిస్తోంది.
దక్షిణాది రాష్ట్రాల లోక్ సభ ఎన్నికల ఇన్ ఛార్జ్ గా నియమించే అవకాశం ఉందని తెలుస్తోంది.