బీఆర్ఎస్( BRS ) పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ జరగబోయే పార్లమెంట్ ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు.కేసిఆర్( KCR ) దండు ఢిల్లీలో ఉంటేనే తెలంగాణకి మేలు జరుగుతుందని తెలిపారు.
అక్కడ బీఆర్ఎస్ లేకపోతే పార్లమెంట్ లో తెలంగాణ ఉనికి లేకుండా పోతుంది.రాబోయే రోజుల్లో తెలంగాణ అనే పదమే ఉండదు.
అని కేటీఆర్( KTR ) తెలంగాణ భవన్‌లో బుధవారం ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశంలో వ్యాఖ్యానించారు.మొన్న జరిగిన ఎన్నికలలో పార్టీపై జరిగిన దుష్ప్రచారం వల్లే ఓటమిపాలైనట్లు తెలిపారు.
ఇదే సమయంలో పార్టీని సంస్థగతంగా బలోపేతం చేయటంలో కొన్ని పొరపాట్లు కూడా జరిగాయని అన్నారు.తెలంగాణలో కేసీఆర్ చేసిన అభివృద్ధి విషయంలో ప్రజలలో ఎలాంటి ఫిర్యాదులు లేవని పేర్కొన్నారు.ఈ విషయాన్ని క్షేత్రస్థాయి నాయకులు కూడా చెబుతున్నారని వ్యాఖ్యానించారు.ఉద్యోగాలు మొదలు వివిధ అంశాలపై కాంగ్రెస్ పార్టీ( Congress party ) అబద్ధాలు చెప్పి మోసపూరితమైన హామీలు ఇచ్చి గెలిచిందని కేటీఆర్ విమర్శలు చేశారు.
తెలంగాణ ప్రయోజనాల కోసం రాజీ లేకుండా కోట్లాడాలి.కేంద్ర ప్రభుత్వంతో అది సాధ్యమయ్యేది బీఆర్ఎస్ తో మాత్రమే.కాంగ్రెస్, బీజేపీ పార్టీలతో ఎంత మాత్రం కాదు.తెలంగాణ ప్రయోజనాలకు శ్రీరామరక్ష బీఆర్ఎస్ పార్టీ అని అన్నారు.
తెలంగాణ బలం, గళం, దళం బీఆర్ఎస్.కేసీఆర్ తోనే తెలంగాణ అనే రాష్ట్రం వచ్చింది.
తెలంగాణ అనే పదానికి పర్యాయపదం కేసీఆర్ అని కేటీఆర్ అభివర్ణించారు.