సంక్రాంతి పండుగ కానుకగా రిలీజ్ కానున్న సినిమాలలో చివరిగా నా సామిరంగ సినిమాకు ( Na Samiranga movie )సంబంధించిన ప్రకటన వచ్చింది.అయితే నా సామిరంగ సినిమాకు సోలో రిలీజ్ డేట్ దక్కినా థియేటర్ల విషయంలో ఇబ్బందులు తప్పవని తెలుస్తోంది.
విజయ్ బిన్నీ డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతుండగా అల్లరి నరేష్, రాజ్ తరుణ్( Allari Naresh, Raj Tarun ) ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.అషికా రంగనాథ్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించారు.
నా సామిరంగ సినిమాతో తాజాగా రిలీజ్ డేట్ కు సంబంధించిన ప్రకటన వెలువడింది.నా సామిరంగ సినిమాకు ఎన్ని థియేటర్లు దక్కుతాయో చూడాల్సి ఉంది.గతంలో సంక్రాంతి కానుకగా తన సినిమాలను విడుదల చేసి నాగార్జున( Nagarjuna ) బ్లాక్ బస్టర్ హిట్లను సాధించిన సందర్భాలు అయితే ఉన్నాయి.ప్రధాన నగరాలలో మినహా మిగతా ప్రాంతాలలో థియేటర్ల కోసం సినిమాలకు ఇబ్బందులు ఎదురయ్యే ఛాన్స్ అయితే ఉంది.
నా సామిరంగ సినిమా విషయంలో నాగ్ నమ్మకం నిజమవుతుందో లేదో చూడాల్సి ఉంది.నా సామిరంగ సినిమా బాక్సాఫీస్ వద్ద 25 కోట్ల రూపాయల కలెక్షన్లు సాధిస్తే హిట్ గా నిలిచే అవకాశం ఉంటుంది.నా సామిరంగ మూవీ తెలుగులో మాత్రమే రిలీజ్ కానుండగా ఈ సినిమా ఏ రేంజ్ లో హిట్ గా నిలుస్తుందో చూడాల్సి ఉంది.నాగ్ కెరీర్ లో ఈ సినిమా స్పెషల్ మూవీగా నిలుస్తుందేమో చూడాలి.
నాగార్జున సొంత బ్యానర్ ద్వారానే ఈ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేస్తారని సమాచారం అందుతోంది.300 థియేటర్లకు అటూఇటుగా ఈ సినిమా విడుదలయ్యే ఛాన్స్ అయితే ఉంది.నాగార్జునకు రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలు దక్కాలని అభిమానులు కోరుకుంటున్నారు.అక్కినేని నాగార్జునను అభిమానించే అభిమానుల సంఖ్య ఊహించని రేంజ్ లో పెరుగుతోంది.