చాలామంది యువకులు పనికిరాని పనులు చేస్తూ తమ టైమ్ వేస్ట్ చేస్తుంటారు.మరి కొందరు మాత్రం సమయాన్ని బాగా సద్వినియోగం చేసుకుంటారు.
ఆ సమయంలో సరికొత్త ఆవిష్కరణలు కనిపెడుతూ అందరిని ఆశ్చర్యపరుస్తుంటారు.అంతే కాకుండా తమ జీవితాలను సులభతరం చేసుకుంటారు.
తాజాగా అలాంటి జీనియస్ కి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ మారింది.ఇందులో ఒక వ్యక్తి సోఫా బండిని తయారు చేశాడు.
ఆ తర్వాత దానిపై చక్కర్లు కొడుతూ వావ్ అనిపించాడు.దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.
వైరల్ వీడియోలో సోఫాలో వేసిన ఓ పిల్లో పక్కకి తీయడం చూడవచ్చు.తర్వాత ఒక జిప్ రిమూవ్ చేశారు.
అది తీయగానే ఫ్యూయల్ ట్యాంక్ కనిపించింది.ఆ ట్యాంక్ లో ఫ్యూయల్( Fuel ) రీఫిల్ చేశారు.
తర్వాత ఒక దారం లాంటిది లాగగానే ఆ సోఫా కింద అమర్చిన మోటార్ స్టార్ట్ అయింది.ఈ సోఫా మోటార్( Sofa motor ) పైన ఒక యాక్సిలరేటర్ కూడా పెట్టారు.
అదే ఒక హ్యాండిల్ గా కూడా వర్క్ అవుతోంది.కింద చక్రాలు సెట్ చేశారు.
అన్నిటినీ కలిపేసి ఒక కారులాగా వర్క్ అయ్యేటట్లు రూపొందించారు.ఇంకేముంది యాక్సిలరేషన్ ఇవ్వగానే ఆ సోఫా బండి రోడ్లపై పరుగులు తీసింది.
ఈ సోఫా బండిపై ఇద్దరు కూర్చున్నారు.ఒకరు ఆపరేట్ చేస్తుంటే మరొకరు హాయిగా ఎంజాయ్ చేశారు.ట్రాఫిక్ లేని రోడ్లపై వీరు ఈ సేవలో ప్రయాణం చేశారు.ఇదొక జీనియస్ ఐడియా అని వీడియో షేర్ చేసిన @TheFigen_ ట్విట్టర్ పేజీ( Twitter ) పేర్కొంది.ఈ వీడియోకు ఇప్పటికే 48 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.30 వేలకు పైగా లైక్స్ వచ్చాయి.నెటిజన్లు ఈ బండిని చూసి చాలా ఇంప్రెస్ అవుతున్నారు.చిన్నప్పుడు ఇలాంటి బండి ఉంటే ఎంత బాగుండో అని తాము కలలు కన్నామని, దీనిని వీరు నిజం చేశారని ఒకరు అన్నారు.
ఇంట్లో కూడా ఈ సోఫా నడుపుతూ ఫ్రిడ్జ్ వద్దకు వెళ్లొచ్చని కిచెన్ లోకి కూడా పోవచ్చు అని మరికొందరు ఫన్నీగా కామెంట్లు చేశారు.
లోకల్ ఐస్ క్రీమ్ రెస్టారెంట్స్ కి వెళ్లడానికి ఇలాంటి సోఫా బండి ఉంటే చాలా బాగుంటుందని మరొక యూజర్ పేరు కొన్నారు.అయితే హెల్మెట్స్ సీట్ బెడ్స్ లేకుండా వీరి ప్రయాణాలు చేస్తున్నారని అది ఎంత మాత్రం సేఫ్ కాదని ఇంకొకరు పేర్కొన్నారు.మొత్తం మీద ఈ వీడియో చాలా మందిని ఆకట్టుకుంది.
దీనిపై మీరు కూడా ఒక లుక్కేయండి.