రాబోయే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో హోరాహోరీ పోరు ఉండేలా కనిపిస్తోంది.టిడిపి, జనసేన పార్టీలు( TDP and Janasena parties )కలిసి పోటీ చేస్తుండగా, వైసిపి ఒంటరిగానే బరిలోకి దిగుతోంది.
ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభ్యర్థుల ఎంపిక పై కసరత్తు మొదలు పెట్టారు.జనసేన గెలిచే అవకాశం ఉన్న నియోజకవర్గాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు.
మూడు రోజులపాటు పవన్ కళ్యాణ్ కాకినాడలోని బస్ చేసి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పార్టీ వ్యవహారాలను సమీక్ష చేయనున్నారు.ఈ సందర్భంగా ఈ ఉమ్మడి జిల్లాలో జనసేన గెలిచే అవకాశం ఉన్న నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఎంపిక చేయడంతో పాటు, ఆ స్థానాలను కచ్చితంగా తమకు ఇవ్వాల్సిందేనని టిడిపి వద్ద షరతులు పెట్టే అవకాశం కనిపిస్తోంది.
ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో సర్వేలు చేయించుకున్న పవన్ వాటి ఆధారంగానే ఈ ఎంపికలు చేపడుతున్నారు.
పనిలో పనిగా తాను ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే గెలుపునకు డోఖా ఉండదు అనే విషయాన్ని పవన్ సర్వేల ద్వారా తెలుసుకున్నారు.ఈ మేరకు కాకినాడ సిటీ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు పవన్ ఆసక్తి చూపిస్తున్నారు.ఈసారి తన గెలుపునకు ఎటువంటి డాకా లేకుండా ఉండేందుకు చాలా జాగ్రత్తగా నిర్ణయాలను తీసుకుంటున్నారు.
గతంలో భీమవరం, గాజువాక నియోజకవర్గం లో ఓటమి ఎదురు కావడంతో, ఈసారి ఆ పరిస్థితి రాకుండా ముందుగానే పవన్ జాగ్రత్త పడుతున్నారు.అదీ కాకుండా, జగన్ కు అత్యంత సన్నిహితుడుగా ముద్ర పడిన కాకినాడ సిటీ వైసిపి ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని టార్గెట్ గా చేసుకుని పవన్ ( Pawan Kalyan )ఇక్కడి నుంచి బరిలోకి దిగాలని భావిస్తున్నారట.
గతంలోనే వారాహి యాత్రలో భాగంగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి( Dwarampudi Chandrasekhar Reddy ) పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.ఇప్పుడు అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి తన సత్తా చాటుకోవాలనే ఆలోచనతో పవన్ ఉన్నారట.కాకినాడ సిటీ నుంచి పోటీ చేస్తే ఆ ప్రభావం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల పైన పడుతుందని, జనసేన కు ఈ జిల్లాలో ఎక్కువ స్థానాలు వస్తాయని పవన్ భావిస్తున్నారట.దీంతో పాటు ద్వారంపూడిని ఓడించడం అంటే దాదాపు జగన్ ను ఓడించడమే అన్న లెక్కల్లో పవన్ ఉన్నారట.