వైసీపీ మంత్రి ఉషశ్రీ చరణ్ కీలక వ్యాఖ్యలు చేశారు.వచ్చే ఎన్నికల్లో పెనుకొండ నుంచి పోటీ చేయనున్నట్లు తెలిపారు.
వాల్మీకి సామాజిక వర్గానికి కల్యాణదుర్గం టికెట్ కేటాయించడంతో తనను పెనుకొండ నియోజకవర్గానికి పార్టీ అధిష్టానం మార్చిందని మంత్రి ఉషశ్రీ చరణ్ పేర్కొన్నారు.సామాజిక వర్గీకరణాల నేపథ్యంలో పార్టీ నిర్ణయానికి కట్టుబడి నియోజకవర్గం నుంచి మారాల్సి వచ్చిందని తెలిపారు.
పార్టీ అధిష్టాన నిర్ణయమే తన నిర్ణయమని ఆమె స్పష్టం చేశారు.అలాగే రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా మరోసారి వైసీపీనే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.