ఇటీవల ఓ ప్రముఖ టీవీ ఛానల్ స్టూడియోలో కొలికపూడి శ్రీనివాసరావు( Kolikapudi Srinivasa Rao ) ఆర్జీవి పై సీరియస్ వ్యాఖ్యలు చేయడం తెలిసిందే.రామ్ గోపాల్ వర్మ ( Ram Gopal Varma ) తల నరికి తీసుకొస్తే కోటి రూపాయలు ఇస్తానని బహిరంగంగా ఆఫర్ ఇవ్వటం జరిగింది.
ఈ కామెంట్లపై రాంగోపాల్ వర్మ ఏపీ డీజీపీకి కంప్లైంట్ కూడా చేయడం జరిగింది.ఈ క్రమంలో రాంగోపాల్ వర్మ తల నరికితే కోటి రూపాయలు ఇస్తానని చెప్పటంపై జనసేన నేత నాగబాబు( Nagababu ) ఫేస్ బుక్ లో స్పందించారు.”RGV గారి పై అటువంటి వ్యాఖ్యలు చేయడం తప్పు నేను కూడ వాటిని తీవ్రంగా ఖండిస్తున్నాను.
RGV గారు మీరేం భయపడకండి మీ జీవితానికి ఏ డోఖా లేదు, మీ ప్రాణానికి ఏ అపాయం వాటిల్లదని నేను హామీ ఇస్తున్నాను ఎందుకంటే.ఆంధ్రప్రదేశ్ లో…( Andhra Pradesh ) ఆ మాటకొస్తే ఇండియా లో ఏ పనికిమాలిన ఎధవ మీకెటువంటి హాని తలపెట్టడు ఎందుకంటే హీరో విలన్ కొట్టుకుంటుంటే మధ్యలో కమెడియన్ గాడ్ని ఎవడు చంపడు కదా మీరేం వర్రీ అవకండి కాబట్టి నిశ్చింతగా, నిర్భయంగా ఓ ఓడ్కా పెగ్గేసి పడుకోండి”…ఎల్లపుడు మీ మంచి కోరే.మీ శ్రేయోభిలాషి, నాగబాబు….
అంటూ పేస్ బుక్ లో పోస్ట్ పెట్టడం జరిగింది.