ఫుట్‌బాల్( Football ) గేమ్‌కు క్రికెట్ కంటే ఎక్కువగా చెవులు కోసుకునే వీరాభిమానులు ఉంటారు.ఈ గేమ్ చాలా రసవత్తరంగా సాగుతుంది.
చిన్నపిల్లలు కూడా వీటికి డైహార్డ్ ఫ్యాన్స్ అయి ఉంటారు.తమ అభిమానాన్ని చూపించేందుకు వీరు క్రియేటివ్ గా ఆలోచిస్తారు.
వినూత్నమైన ప్లకార్డ్స్, కాస్ట్యూమ్స్, ఆర్ట్ వర్క్స్ తో ఆశ్చర్య పరుస్తుంటారు.తాజాగా ఒక బ్రెజిల్ ఫుట్‌బాల్ ఫ్యాన్ రంగురంగుల అద్దాలతో డిజైన్ చేసిన కాస్ట్యూమ్ ధరించి అలరించాడు.
దానికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా వైరల్ అవుతుంది.
వైరల్ వీడియోలో ఒక యువకుడు అద్దాలతో తయారుచేసిన ఔట్‌ఫిట్ ( Mirror outfit )ధరించి మనుషుల మధ్య తిరగడం చూడవచ్చు.చాలామంది చూసి ఇతడిని చూసి ఆశ్చర్యపోయారు.సెల్ఫీలు దిగడానికి కూడా ఆసక్తి కనబరిచారు.
ఈ యువకుడి చేతిలో ఒక ట్రోఫీ కూడా ఉంది.దానిని కూడా అద్దాలతోనే డిజైన్ చేశారు.
ఈ ఆలోచన ఎలా వచ్చిందో కానీ చూసేందుకు మాత్రం ఇది అద్భుతంగా ఉంది.బ్రెజిల్( Brazil ) ఫుట్‌బాల్ ఫ్లాగ్ కలర్స్‌లో ఈ అద్దాలు కనిపించాయి.
@gunsnrosesgirl3 ట్విట్టర్ పేజీ( Twitter ) షేర్ చేసిన ఈ వీడియోకు ఇప్పటికే 4 కోట్ల 49 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.రెండు లక్షల పైగా లైక్స్ వచ్చాయి.“ఒక బ్రెజిల్ ఫ్యాన్ కంప్లీట్ మిర్రర్ ఔట్‌ఫిట్ ధరించాడు.” అని దీనికి ఒక క్యాప్షన్ జోడించారు.ఈ వీడియో చూసి చాలామంది నెటిజన్లు షాక్ అవుతున్నారు.ఆ అద్దాల కాస్ట్యూమ్‌తో కింద పడితే పరిస్థితి ఏంటని మరికొందరు ప్రశ్నిస్తున్నారు.ఇది చూసేందుకు అచ్చం కంప్యూటర్ గ్రాఫిక్స్ లాగానే అనిపిస్తోందని మరికొందరు సందేహాన్ని వ్యక్తం చేశారు.డిజిటల్ ఇమేజ్‌కు ప్రాణం పోసినట్లుగా అనిపిస్తోందని ఒక నెటిజెన్ కామెంట్ చేశాడు.
ఇది చాలా క్రేజీగా ఉందని ఇంకొకరు అన్నారు.అన్ని అద్దాలు ధరించి నడవడం కష్టంగా ఉంటుందని ఇది ఫేక్ అయి ఉండొచ్చు అని మరికొందరు తమ అభిప్రాయాలను వ్యక్తపరిచారు.