బంగాళాదుంప పంటను ఆశించే వెండి పోలుసు తెగుళ్లను నివారించే పద్ధతులు..!

బంగాళాదుంప పంటను( Potato Cultivation ) ఆశించే వెండి పోలుసు తెగుళ్లు ఒక ఫంగస్ వల్ల పంటను ఆశిస్తాయి.ఈ ఫంగస్ బంగాళాదుంపలపై అధిక కాలం పాటు జీవిస్తుంది.

 Ways To Prevent Silvery Pole Pests That Are Expecting The Potato Crop , Agricu-TeluguStop.com

తెగుళ్లు ( Pests )భూమి నుంచి మరియు తెగుళ్లు సోకిన విత్తన దుంపల వల్ల సోకుతుంది.బంగాళా దుంప తోలు పై వెండి పోలుసు తెగుళ్ళను గుర్తించవచ్చు.

ఈ తెగుల లక్షణాలు కోత సమయంలో ఉంటాయి.పంటను నిల్వ ఉంచిన తర్వాత ఈ తెగుళ్లు బయటపడతాయి.

బంగాళాదుంప పంటను నిల్వ చేసిన తర్వాత వాటిపై వెండిమచ్చలు, గోధుమ రంగు అంచులతో కలిగి ఉండడం గుర్తించవచ్చు.

ఈ తెగుళ్లు పంటను ఆశించకుండా ఉండాలంటే.తెగులు నిరోధక ఆరోగ్యకరమైన విత్తన దుంపలను ఎంపిక చేసుకొని సాగు చేపట్టాలి.పంట కోతకు వచ్చినప్పుడు ఆలస్యం చేయకుండా దుంపలను త్వరగా తీయాలి.

పొలంలో ఉపయోగించే పరికరాలను ఎప్పటికప్పుడు శుద్ధి చేయాలి.బంగాళాదుంపలను చల్లటి మరియు పొడి వాతావరణం లో మంచి గాలి తగిలే ప్రదేశంలో నిల్వ చేయాలి.

ప్రతి రెండు లేదా మూడు సంవత్సరాలకు ఒకసారి పంట మార్పిడి చేయాలి.వీలైనంతవరకు పంటకు ఉదయం పూట మాత్రమే నీటి తడులు అందించాలి.

పొలంలో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.విత్తన దుంపలు నాటేముందు, పంట కోత సమయంలో దుంపలపై శీలింద్ర నాశినులు వాడటం వలన ఈ వెండి పోలుసు తెగుళ్లు సోకకుండా నిరోధించవచ్చు.

బంగాళాదుంపలపై థియబెండజోల్ ను డస్ట్ లాగ వాడి, పంట నిల్వ సమయంలో ఈ వెండి పొలుసు తెగుళ్లు పంటకు సోకకుండా చేయవచ్చు.రైతులు( Farmers ) పంటలను పండించడానికి ఎన్నో మెళుకువలను పాటించి ఈ యాజమాన్య పద్ధతులను పాటిస్తారు.అలాగే పంట కోతల అనంతరం పంట నిల్వ విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ క్షేత్ర నిపుణులు సూచిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube