తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త అధ్యక్షుడు ?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో( Telangana assembly election ) ఘన విజయం సాధించడంతో మంచి ఉత్సాహం మీద ఉన్న కాంగ్రెస్ లోక్ సభ ఎన్నికల్లోనూ అంతే స్థాయిలో విజయం సాధించాలనే పట్టుదలతో ఉంది.వీలైనంత ఎక్కువ ఎంపీ సీట్లను సాధించి తెలంగాణలో పట్టు నిలుపుకోవాలనే ఆలోచనతో ఉంది.

 New President Of Telangana Congress , Telangana Elections, Telangana Governm-TeluguStop.com

దీనిలో భాగంగానే అన్ని ఏర్పాట్లు చేసుకుంటుంది .ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడుగా ఉన్న రేవంత్ రెడ్డి ( Revanth Reddy )ముఖ్యమంత్రి గానూ బాధ్యతలు నిర్వహిస్తూ ఉండడం,  పరిపాలనపైన ఎక్కువగా దృష్టి పెట్టాల్సి రావడంతో,  తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త అధ్యక్షుడిని నియమించాలనే ఆలోచనలో ఆ పార్టీ అధిష్టానం ఉన్నట్లు సమాచారం.అయితే అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి వ్యూహాలు బాగా పనిచేయడంతో,  లోక్ సభ ఎన్నికలకూ ఆయన ఆధ్వర్యంలోనే ముందుకు వెళ్తే మంచిదనే అభిప్రాయాలు ఉన్నా,.  ఇప్పుడున్న పరిస్థితుల్లో రెండు బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహించడం కష్టమనే అభిప్రాయానికి వచ్చిన అధిష్టానం పెద్దలు ,కొత్త అధ్యక్షుడిని నియమించాలని ఆలోచనలో ఉన్నారట.

Telugu Aicc, Pcc, Rahul Gandhi, Revanth Reddy, Sonia, Telangana-Politics

ఈ మేరకు కొంతమంది సీనియర్ నాయకుల పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.ప్రస్తుతం ఏఐసీసీ స్థాయిలో విస్తృతంగా దీనిపై కసరత్తు జరుగుతుంది.అయితే లోక్ సభ ఎన్నికలు ముగిసిన తరువాత ఈ కార్యాచరణను మొదలుపెడితే మంచిదనే అభిప్రాయాలు చాలామంది నాయకులు వ్యక్తం చేశారట .అయితే ప్రస్తుతం కొత్త అధ్యక్షుడి ఎంపికకు సంబంధించి కసరత్తు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది .

Telugu Aicc, Pcc, Rahul Gandhi, Revanth Reddy, Sonia, Telangana-Politics

బీసీ సామాజిక వర్గానికి చెందిన వారికే  అధ్యక్ష పదవి ఇవ్వాలని ఏఐసిసి కూడా నిర్ణయం తీసుకుందట.  ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు త్యాగం చేసిన వారు ,పార్టీ సీనియర్ నాయకులుగా రాష్ట్ర వ్యాప్తంగా అందరిని కలుపుకు వెళ్లగలిగిన నేతల పేర్లను కాంగ్రెస్ ( Congress )అధిష్టానం పరిశీలిస్తున్నట్లు సమాచారం.మరి కొద్ది రోజుల్లోనే దీనికి సంబంధించి  మరింత క్లారిటీ రానుంది.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube