టిడిపి అధినేత చంద్రబాబు స్పీడ్ పెంచారు.మొన్నటి వరకు స్కిల్ డెవలప్మెంట్ స్కాం లో అరెస్టు అయ్యి జైలులో ఉన్న బాబు బెయిల్ పై బయటకు వచ్చిన తర్వాత రాజకీయంగా సైలెంట్ అయ్యారు.
ఇప్పుడు వైసీపీ ప్రభుత్వాన్ని , జగన్ ను టార్గెట్ చేసుకొని తీవ్రస్థాయిలో విమర్శలు మొదలు పెట్టారు.ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో, జనసేనతో కలిసి దూకుడుగా ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు ఈ నేపథ్యంలోనే వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు ఎక్కు పెడుతున్నారు.
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలు అమలు చేసి తమ చిత్తశుద్ది నిరూపించుకున్నామని పదే పదే ప్రకటనలు చేస్తుండడం పై బాబు ప్రశ్నలు వేశారు.అన్ని హామీలను జగన్ అమలు చేస్తే తాను వేసే పది ప్రశ్నలకు జగన్ సమాధానం చెప్పాలని బాబు నిలదీస్తున్నారు.
కేంద్రం మెడలు వంచి సాధిస్తామన్న ప్రత్యేక హోదా ఏమైంది. నాలుగున్నరాళ్లలో ఎంత వంచారు.31 మంది ఎంపీలు ఎందుకు ఉన్నారు.2020 నాటికి పూర్తి అవ్వాల్సిన పోలవరం ప్రాజెక్టును నాశనం చేశావు .పోలవరాన్ని గోదాట్లో ముంచావు సమాధానం ఉందా జగన్ రెడ్డి ?ఎన్నికల ముందు ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ అన్నావు లేదా ఒకటైన ఇచ్చావా ?
నేను 14 ఏళ్లలో 11 డీఎస్సి ల ద్వారా 1.5 లక్షలు టీచర్ పోస్టులు భర్తీ చేస్తాను అని హామీ ఇచ్చి ఐదేళ్లలో నువ్వు ఒక్క డీఎస్సీ పెట్టావా ? రాష్ట్రంలో నిరుద్యోగం రేటు 24 శాతం అని కేంద్రం తేల్చింది.నిరుద్యోగ ఆంధ్రగా మార్చి దేశంలో నెంబర్ వన్ చేసావు. ఉద్యోగాలు ఇవ్వలేదు కానీ యువతకు గంజాయి ఇచ్చావు.మధ్య నిషేధం చేయకపోతే ఓట్లు అడగను అని అన్నావు మరి ఏ మొహం పెట్టుకొని వైఏపీ నీడ్స్ జగన్ అని బయలుదేరావు ?ఎన్నికల ప్రచారంలో మధ్య నిషేధం అని చెప్పావు.మరి అమలు చేసావా ?వారంలో సిపిఎస్ రద్దు అన్నావా లేదా ఇంకా వారం కాలేదా ?ఉచిత ఇసుక ఇస్తానని హామీ ఇచ్చావు మరి అమలు జరిగిందా ?రాజధానిగా అమరావతికి మద్దతు ఇచ్చి ఇప్పుడు మాట తప్పవా లేదా బాదుడే బాదుడు అని నాడు రాగాలు తీశావు. చార్జీలు తగ్గిస్తానని చెప్పావా లేదా ? నేడు అధికారంలోకి వచ్చిన తర్వాత కరెంటు చార్జీలు పెంచావా లేదా అంటూ పది పది ప్రశ్నలను జగన్ కు సందించారు టిడిపి అధినేత.