టాటా గ్రూప్( Tata Group ).ఎయిర్ ఇండియా సంస్థను కొనుగోలు చేసినప్పుడు నుంచి సంస్థలో అనేక రకాల మార్పులకు శ్రీకారం చుట్టిన సంగతి మనకు తెలిసింది.
గత కాలంలో ఎయిర్ ఇండియా సంస్థ లోగో అలాగే ఎయిట్ క్రాఫ్ట్ లివరీ లను కూడా మార్చిన సంఘటన మనకు వేధితమే.ఇకపోతే తాజాగా ఈ సంస్థ క్యాబిన్ క్రూ( Cabin crew
) , అలాగే పైలట్లకు సంబంధించి సరికొత్త యూనిఫాములను రూపొందించింది ఎయిర్ ఇండియా.
తాజాగా ఎందుకు సంబంధించిన ఓ వీడియోను సోషల్ మీడియా ద్వారా ఎయిర్ ఇండియా సంస్థ( Air India Company ) పంచుకుంది.భారతీయ సంస్కృతిని ఉట్టిపడేలా ఈ సంస్థ తగు జాగ్రత్తలు తీసుకుంది.ముఖ్యంగా భారతదేశంలో సుపరిచితుడైన ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రతో ( Manish Malhotra )ఈ వస్త్ర శైలేని రూపొందించినట్లు ఎయిర్ ఇండియా తెలిపింది.ఇందుకు సంబంధించి ఎయిర్ ఇండియా ఓ సోషల్ మీడియా పోస్ట్ ను కూడా షేర్ చేసింది.
ఈ పోస్టులో మా సిబ్బంది యొక్క యూనిఫాములను కొత్తగా డిజైన్ చేశామని తెలుపుతూ.సరికొత్త పైలట్, క్యాబిన్ క్రూ యూనిఫామ్ లను ధరించిన వ్యక్తులను చూపిస్తూ ఉన్న వీడియోను రిలీజ్ చేసింది.ఈ వీడియోలో మనీష్ మల్హోత్రా భారతదేశం యొక్క గొప్పతనం గురించి మాట్లాడుతూ తాము ఇందులో ఇనుమడింప చేశామని తెలియజేశారు.ఇందులో భాగంగా వంకాయ రంగు, ఎరుపు, పసిడి లాంటి రంగులను వాడమని ఇది నూతన భారతదేశాన్ని సూచిస్తాయి అంటూ తెలిపారు.
ఎయిర్ ఇండియా ఆరు దశాబ్దాల కాలం నుండి నడుస్తున్నా.మొదటిసారి సిబ్బంది యూనిఫాం మార్చడం ఇదే తొలిసారి.ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియోని చూసేయండి.