సౌత్ ఆఫ్రికా పర్యటనలో భాగంగా భారత్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా ( India vs South Africa )మధ్య 3 మ్యాచ్ల టీ20 సిరీస్ లో భాగంగా మొదటి మ్యాచ్ రద్దయిన సంగతి తెలిసిందే.ఇక రెండో టీ20 మ్యాచ్ డిసెంబర్ 12వ తేదీ జరగనుంది.
అయితే ఈ టీ20 సిరీస్ లో సూర్య కుమార్ యాదవ్ ఏకంగా విరాట్ కోహ్లీ రికార్డును బ్రేక్ చేసేందుకు సిద్ధమయ్యాడు.ఆ రికార్డు ఏమిటో చూద్దాం.
ప్రస్తుత టీ20 సిరీస్ ఆడే భారత జట్టు కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్( Surya Kumar Yadav ) ఇప్పటివరకు 55 ఇన్నింగ్స్ లలో 1985 పరుగులు చేశాడు.మరో 15 పరుగులు చేస్తే టీ20ల్లో 2000 పరుగులు పూర్తవుతాయి.విరాట్ కోహ్లీ 56 ఇన్నింగ్స్ లలో 2000 పరుగులు చేశాడు.డిసెంబర్ 10వ తేదీ తొలి టీ20 మ్యాచ్ జరిగి ఉంటే విరాట్ రికార్డును సూర్య కుమార్ యాదవ్ కచ్చితంగా బ్రేక్ చేసేవాడు.కానీ మ్యాచ్ రద్దు అవడంతో రెండో టీ20 మ్యాచ్లో ఆ రికార్డు బ్రేక్ చేసే అవకాశం ఉంది.టీ20 అంతర్జాతీయ క్రికెట్లో భారత తరఫున ఇప్పటివరకు కేవలం ముగ్గురు బ్యాటర్స్ మాత్రమే 2000 పరుగుల మార్క్ ను అందుకున్నారు.విరాట్ కోహ్లీ తో పాటు కేఎల్ రాహుల్,( KL Rahul ) రోహిత్ శర్మ( Rohit Sharma ) మాత్రమే ఈ ఘనత సాధించారు.
అంతర్జాతీయ పరంగా చూస్తే ఈ జాబితాలో పాకిస్తాన్ జట్టు కెప్టెన్ బాబర్ అజామ్ మొదటి స్థానంలో ఉండగా.పాకిస్తాన్ జట్టు వికెట్ కీపర్ మహమ్మద్ రిజ్వాన్ రెండవ స్థానంలో ఉన్నాడు.వీరిద్దరూ 52 ఇన్నింగ్స్ లలో 2000 పరుగుల మార్క్ ను అధిగమించారు.
ఈ జాబితాలో మూడవ స్థానంలో విరాట్ కోహ్లీ, నాలుగవ స్థానంలో కేఎల్ రాహుల్ ఉన్నారు.దక్షిణాఫ్రికా టీ20 సిరీస్ పూర్తయితే ఈ జాబితాలో సూర్య కుమార్ యాదవ్ చేరతాడు.
ఇక ప్రస్తుతం జరిగే టీ20 సిరీస్ విషయానికి వస్తే.వరుస రెండు మ్యాచ్లలో గెలిచి భారత్ టైటిల్ కైవసం చేసుకోవాలనే గట్టి పట్టుదలతో ఉంది.