తృణమూల్ కాంగ్రెస్ నేత, ఎంపీ మహువా మొయిత్రా లోక్ సభ సభ్యత్వం రద్దు అయింది.ఈ మేరకు సభ్యత్వాన్ని కేంద్రం రద్దు చేసిందని తెలుస్తోంది.
అయితే ఓ వ్యాపారవేత్త నుంచి డబ్బులు తీసుకుని లోక్ సభలో ప్రశ్నలు అడిగారని ఎంపీ మహువాపై ఆరోణపలు వచ్చిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో ప్రధాని మోదీ, అదానీకి వ్యతిరేకంగా ప్రశ్నలు అడిగారంటూ నమోదైన కేసులో ఎథిక్స్ ప్యానెల్ తన నివేదికను లోక్ సభలో సమర్పించింది.
ఎథిక్స్ కమిటీ నివేదిక మేరకు మహువాపై కేంద్రం చర్యలకు ఉపక్రమించింది.ఈ క్రమంలోనే ఆమె లోక్ సభ సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.