తెలంగాణలో బిఆర్ఎస్( BRS ) కు ప్రత్యామ్నాయం తామేనని మొదటి నుంచి చెబుతూ వచ్చిన కమలనాథులు సరిగ్గా ఎన్నికల ముందు మాత్రం సైలెంట్ అయ్యారు.ముఖ్యంగా కర్నాటకలో ఓటమి తరువాత ఆ ప్రభావం తెలంగాణలో కూడా గట్టిగానే పడింది.
దాంతో తెలంగాణ కమలనాథులంతా విన్నింగ్ టార్గెట్ పై మొఖం చాటేస్తూ వచ్చారు.దానికి తోడు పార్టీలో బండి సంజయ్ ( Bandi Sanjay Kumar )ని అధ్యక్ష పదవి నుంచి తప్పించడం కూడా బీజేపీపై గట్టిగానే ప్రభావం చూపింది.
అప్పటి నుంచి కమలం పార్టీలో అంతర్గత కుమ్ములాటలు పెరిగి ఎన్నికల రేస్ లో వెనుకబడింది.ఇదే సమయంలో కాంగ్రెస్ పుంజుకోవడం కూడా బీజేపీ ఇమేజ్ ను గట్టిగానే దెబ్బతీసింది.
దీంతో సరిగ్గా ఎన్నికల ముందు కమలం పార్టీ హడావిడి పూర్తిగా తగ్గింది.
అయితే ఎలగూ ఎన్నికల్లో గెలిచి అధికారం సంపాధించడం కష్టమే అని భావించిన తెలంగాణ బీజేపీ వాట్ నెక్స్ట్ అనే దానిపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది.ప్రస్తుతం బిఆర్ఎస్ మరియు కాంగ్రెస్ మద్య హోరాహోరీ పోరు నడుస్తున్న నేపథ్యంలో ఇరు పార్టీలక్లు మెజారిటీ ఓటు షేర్ లభించడం కష్టమే అనేది కొందరి అభిప్రాయం.దాంతో హంగ్ ఏర్పడే అవకాశాలు చాలా ఎక్కువ హంగ్ ఏర్పడితే బీజేపీ కీరోల్ పోషించే అవకాశం ఉంది.
ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం బీజేపీ 10-20 స్థానాల్లో సత్తా చాటే ఛాన్స్ లు కనిపిస్తున్నాయనేది కొందరి అభిప్రాయం.
అలా చూస్తే అటు బిఆర్ఎస్ అధికారం చేపట్టాలన్న లేదా కాంగ్రెస్ ( Congress )అధికారం చేపట్టాలన్న బీజేపీ( BJP ) మద్దతు కీలకంగా మారే అవకాశం ఉంది.హస్తం పార్టీతో బీజేపీ కలిసే అవకాశం లేదు.అందువల్ల బిఆర్ఎస్ తోనే కలుస్తుందనేది కొందరి విశ్లేషకుల అభిప్రాయం.
ఒకవేళ బిఆర్ఎస్ తో కలవాల్సివస్తే.కొన్ని కీలక పదవులతో మరికొన్ని డిమాండ్లను ఆ పార్టీ ముంగిట పెట్టె అవకాశం ఉంది.
బీజేపీ వ్యూహాలు ఫలిస్తే సిఎం పదవిని కూడా కమలనాథులు డిమాండ్ చేసే ఛాన్స్ ఉందనేది కొందరు రాజకీయవాదులు చెబుతున్నామాట.అందుకే ప్రస్తుతం బీజేపీ సైలెంట్ గా ఉంటుందని, ఫలితాల తర్వాత ఆ పార్టీ వ్యూహరచన మొదలౌతుందనేది కొందరి అభిప్రాయం.
మరి కమలం పార్టీ ప్రణాళికలు ఎంతవరకు నెరవేరుతాయో చూడాలి.