మెగాస్టార్ చిరంజీవి ( Megastar Chiranjeevi ) ఒకేసారి రెండు సినిమాలను ప్రకటించిన విషయం తెలిసిందే.ఆ రెండు సినిమాలపై ఇప్పటికే అంచనాలు భారీ స్థాయిలో పెరిగాయి.
మరి మెగాస్టార్ ప్రకటించిన సినిమాల్లో మెగా 156 ఒకటి.ఈ సినిమా ఇటీవలే విజయదశమి రోజు ఘనంగా లాంచ్ అయ్యింది.
ఇక లాంచ్ అయినప్పటి నుండి ఎప్పుడెప్పుడు షూట్ స్టార్ట్ అవుతుందా అని అంత ఎదురు చూస్తున్నారు.ఈ క్రమంలోనే ఎట్టకేలకు షూట్ స్టార్ట్ అయ్యినట్టు తెలుస్తుంది.గత కొద్దీ రోజులుగా ప్రీ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్న మేకర్స్ తాజాగా షూట్ స్టార్ట్ చేసారు.నేటి నుండి రెగ్యురల్ షూట్ స్టార్ట్ అయ్యినట్టు టాక్.
ప్రస్తుతానికి చిరు లేకుండానే షూట్ స్టార్ట్ చేసినట్టు తెలుస్తుంది.
మరి ఫస్ట్ షెడ్యూల్ లో పలు కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నట్టు సమాచారం.ఇక ఇప్పటి నుండి ఈ సినిమాలో నటించబోయే నటీనటులను అఫిషియల్ గా అనౌన్స్ చేయనున్నారు.కాగా ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ వారు భారీ స్థాయిలో నిర్మిస్తుండగా ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
ఇక ఈ సినిమాను బింబిసార డైరెక్టర్ వసిష్ఠ మల్లిడి ( Director Mallidi Vassishta ) తెరకెక్కిస్తున్న విషయం విదితమే.బింబిసార వంటి హిట్ తర్వాత వసిష్ఠ మెగాస్టార్ తో సినిమా చేస్తుండడంతో సాధారణ ఆడియెన్స్ కూడా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.
భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను 2025 సంక్రాంతి టార్గెట్ గా ఆడియెన్స్ ముందుకు రానుంది.