ఉత్తరాఖండ్ టన్నెల్ సహాయక కార్యక్రమాలు పదో రోజు కొనసాగుతున్నాయి.ఈ మేరకు టన్నెల్ లోపల చిక్కుకున్న కార్మికుల దృశ్యాలను తొలిసారి విడుదల చేశారు.
పైప్ లైన్ ద్వారా ఎండోస్కోపిక్ ఫ్లెక్సీ కెమెరాను అధికారులు పంపారు.ఈ క్రమంలో టన్నెల్ లోపల చిక్కుకున్న కార్మికులతో సహాయక సిబ్బంది ఆడియో విజువల్ కాంటాక్ట్ అయ్యారు.
కార్మికులను బయటకు తీసుకు వచ్చేందుకు అధికారులు గత పది రోజులుగా ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే.ఇందులో భాగంగానే టన్నెల్ లోపల వైఫై కనెక్షన్ ను ఏర్పాటు చేయాలని అధికారులు భావిస్తున్నారని తెలుస్తోంది.
కాగా డీఆర్డీఓ రోబోలు సహాయక చర్యల్లో భాగంగా అయ్యాయి.మరోవైపు కూలీలు చిక్కుకున్న సొరంగానికి మూడు వైపుల నుంచి డ్రిల్లింగ్ చేయాలని అధికారులు నిర్ణయించిన సంగతి తెలిసిందే.
ఇందులో భాగంగానే ప్రధాన సొరంగం కుడి, ఎడమ వైపుల నుంచి అడ్డంగా రెండు డ్రిల్స్ తో పాటు సొరంగంపై నుంచి నిలువు షాప్ట్ డ్రిల్లింగ్ చేస్తున్నారు.అయితే ఉత్తరకాశీ జిల్లా యమునోత్రి జాతీయ రహదారిపై సిల్క్యారా- దండల్ గావ్ మధ్య నిర్మాణంలో ఉన్న సొరంగం కూలిన ఘటనలో సుమారు 41 మంది కార్మికులు చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే.