నేషనల్ అవార్డు విన్నర్, కోలీవుడ్ హీరో ధనుష్( Dhanush ) గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పనిలేదు.రఘువరన్ బీటెక్, పందెం కోళ్ళు, దూల్‌పేట, ఆడుకాలం, రాంజనా వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించి ప్రేక్షకుల మనసులను ఈ హీరో దోచేశాడు.
కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ కి అల్లుడు కూడా అయ్యాడు.ఇతడు ఐశ్వర్య రజనీకాంత్ ని పెళ్లి చేసుకున్నాడు.2004లో వీరిద్దరూ పెళ్లి బంధంతో ఒకటి అయ్యారు.అయితే 2022లో కొన్ని తెలియని కారణాలవల్ల విడిపోయారు.
రజనీకాంత్ ధనుష్ కి తన అమ్మాయినిచ్చి పెళ్లి చేయడానికి చాలానే కారణాలు ఉన్నాయి.ఒకటి ఏంటంటే, ధనుష్ చాలా బాగా యాక్ట్ చేస్తాడు.
యాక్టింగ్ రంగంలో అతనికి మించిన నటుడు లేడని చెప్పవచ్చు. అసురన్ సినిమా( Asuran ) చూస్తే ఆ విషయం ఎవరికైనా అర్థమవుతుంది.
అయితే మంచి నటుడు మాత్రమే కాదు ధనుష్ మంచి వ్యక్తిత్వం ఉన్నవాడు కూడా.ఒకప్పుడు ధనుష్ బాగా తాగే వాడట కానీ మానేద్దామని అనుకున్నాక డ్రింకింగ్ పూర్తిగా మానేసాడట.
అలాగే ధనుష్ ప్యూర్ వెజిటేరియన్ అని ఇటీవల రోబో శంకర్( Robo Shankar ) వెల్లడించాడు.

సాధారణంగా సినిమా రంగంలో ఉన్నప్పుడు పార్టీలు, ఈవెంట్స్ అంటూ తిరగాల్సి ఉంటుంది.అలాంటి సందర్భాలలో కొద్దిగా అయినా డ్రింక్ తాగుతుంటారు.ఇక నాన్ వెజిటేరియన్ ఫుడ్ వాసన చూస్తే టెంప్ట్ అవ్వక తప్పదు.
ఒక్కోసారి సినిమా రోల్ కోసం లావుగా తయారు కావడానికి నాన్ వెజ్ తినక తప్పదు.కానీ ధనుష్ మాత్రం చాలా నిగ్రహం కలిగి ఉంటాడు.అందుకే ఆ రెండిటినీ పక్కన పెట్టాడు.తాగొద్దని నిర్ణయించుకున్నాక ఇప్పటివరకు ధనుష్ ఒక్కసారి కూడా తాగలేదని రోబో శంకర్ వెల్లడించాడు.

ప్రస్తుతం రోబో శంకర్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.చాలామంది ఒక స్టార్ హీరో అయ్యుండి కూడా ఇలా నాన్ వెజ్ డైట్ మాత్రమే ఫాలో అవుతున్న ధనుష్ కు చాలామంది హ్యాట్సాఫ్ చెబుతున్నారు.ప్రస్తుతం ధనుష్ పీరియడ్ యాక్షన్ అడ్వెంచర్ ఫిలిం “కెప్టెన్ మిల్లర్” చేస్తున్నాడు దీంతో పాటు తన 50వ సినిమాకి కూడా సైన్ చేశాడు.D50 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాని ధనుష్ డైరెక్ట్ చేస్తున్నాడు.కథ కూడా అతడే అందించాడు.హీరోగా కూడా తనే యాక్ట్ చేస్తున్నాడు.కళానిధి మారని దీనిని ప్రొడ్యూస్ చేస్తున్నాడు.ఈ సినిమాలో నిత్యామీనన్ నటిస్తోంది.
ఈ రెండు ధనుష్ సినిమాలు వచ్చే ఏడాది రిలీజ్ కానున్నాయి.