పోలీస్ అధికారిపై దాడి కేసులో నిందుతునికి రెండు సంవత్సరాల జైలు శిక్ష, 2000 రూపాయల జరిమాన..

పోలీస్ అధికారిపై దాడి చేసిన వ్యక్తికి రెండు సంవత్సరాల జైలు శిక్ష తోపాటు రూ.2000 జరిమానా విధిస్తూ సిరిసిల్ల ప్రథమ శ్రేణి న్యాయమూర్తి ప్రవీణ్ బుధవారం రోజున తీర్పు వెల్లడించడం జరిగిందని జిల్లా ఎస్పీ బుధవారం రోజున ఒక ప్రకటనలో తెలిపారు.ప్రాసిక్యూషన్ కథనం మేరకు 28 జులై 2013 రోజున సిరిసిల్ల పట్టణంలోని విద్యానగర్ లో తబ్లిక్ జమాత్, సున్ని జమాత్ కి చెందిన ముస్లిం కులస్తులు రెండు గ్రూపులుగా విడిపోయి కొట్లాడుచున్నారని సిరిసిల్ల పోలీస్ స్టేషన్ కి సమాచారం అందింది.అప్పటి సిరిసిల్ల సి.ఐ నాగేంద్రచారి తన సిబ్బందితో సంఘటన స్థలానికి వెళ్లి గొడవను ఆపే ప్రయత్నం చేస్తుండగా సిరిసిల్లకి చెందిన మహమ్మద్ తాజ్ అనే వ్యక్తి సిఐ పైకి రాయి విసిరగా చేతికి గాయమైంది.ఇట్టి సంఘటనపై పోలీసులు కేసు నమోదుచేసి మహమ్మద్ తాజ్ ని రిమాండ్ కి తరలించి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసారు.

 Assault On Police Accused Was Sentenced To Two Years In Prison And Fined Rs 2000-TeluguStop.com

ప్రాసిక్యూషన్ తరపున పి.పి.చెలుమల సందీప్ వాదించగా, కోర్టు మానిటరింగ్ ఎస్.ఐ.శ్రీకాంత్ ఆధ్యర్యంలో కోర్టు కానిస్టేబుల్ వేముల నరేష్ తొమ్మిది మంది సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టారు.కేసు పూర్వాపరాలను పరిశీలించిన న్యాయమూర్తి నేరం రుజువు కావడంతో నిందితుడికి జైలు శిక్షతో పాటు 2000 రూపాయల జరిమానా విధించనట్లు ఎస్పీ ఒక ప్రకటనలో తెలిపారు.

జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీస్ శాఖ ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండి ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నామని, పోలీస్ అధికారులు, సిబ్బంది వివిధ విధులు నిర్వహిస్తున్న విధులకు ఆటంఖం కలిగించిన, చట్టాన్ని చేతిలోకి తీసుకొని పోలీస్ అధికారులు,సిబ్బంది పై దురుసుగా ప్రవర్తింస్తూ జీవన విధానానికి ఆటంఖం కలిగించిన వారు ఎంతటివారైనా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ ఈ సందర్భంగా హెచ్చరించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube