లక్షలాది జీమెయిల్ ఖాతాలను తొలగించనున్న గూగుల్.. ఇలా చేస్తే మీ ఖాతా సేఫ్..!

జీమెయిల్ ఖాతాదారులకు గూగుల్ సంస్థ( Google ) ఊహించని షాక్ ఇచ్చింది.జీమెయిల్( Gmail ) తాను తరచూ ఉపయోగించకపోతే ఖాతా త్వరలోనే నిలిపివేయబడుతుందని గూగుల్ సంస్థ తెలిపింది.

 Google Will Delete Millions Of Gmail Accounts If You Do This Your Account Will-TeluguStop.com

అయితే ఖాతాదారులు తమ ఖాతాను డిలీట్ కాకుండా భద్రపరచుకోవాలనుకుంటే.అటువంటి వారి కోసం గూగుల్ అత్యవసర గడువును జారీ చేసింది.

డిసెంబర్ లో జీమెయిల్ ఖాతాలను తొలగించే ప్రక్రియ గూగుల్ సంస్థ ప్రారంభించనుంది.కనీసం రెండేళ్ల పాటు యాక్టివ్ గా లేని ఖాతాలను లక్ష్యంగా చేసుకొని ఈ తొలగింపు చేయనుంది.

గత రెండేళ్లలో లాగిన్ చేయని లేదా ఉపయోగించని జీమెయిల్ ఖాతాలను పూర్తిగా తొలగించనుంది.జీమెయిల్, డాక్స్, క్యాలెండర్, ఫోటోలను క్రమం తప్పకుండా ఉపయోగించే వారి ఖాతాలు, ఎప్పుడు యాక్టివ్ గా ఉండే ఖాతాలు తప్ప మిగతా ఖాతాలు తొలగించబడతాయి.

Telugu Cyber Threats, Gmail, Google, Googledelete-Technology Telugu

గూగుల్ సంస్థ ఉద్దేశపూర్వకంగా ఈ జీమెయిల్ ఖాతాలను తొలగించడం లేదు.పాత మరియు ఆక్టివ్ గా లేని ఖాతాలు సైబర్ బెదిరింపులకు( cyber threats ) ఎక్కువ అవకాశం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది.ఒకసారి ఖాతా తొలగించబడితే అందులో ఉన్న డేటా మొత్తం డిలీట్ అయినట్టే.జీమెయిల్ ఖాతా డిలీట్ అవ్వకుండా భద్రంగా ఉండాలంటే వినియోగదారులు కొన్ని స్టెప్స్ ను అనుసరించమని గూగుల్ ఓ సలహా కూడా ఇచ్చింది.

గూగుల్ ఖాతాను తొలగించే ముందు గూగుల్ ఖాతా( Google account ) ఇమెయిల్ చిరునామా మరియు వినియోగదారులు అందించిన రికవరీ ఇమెయిల్ రెండింటికి మొదట నోటిఫికేషన్లను పంపుతుంది.

Telugu Cyber Threats, Gmail, Google, Googledelete-Technology Telugu

ఆక్టివ్ గా లేని ఖాతాలు, మరిచిపోయిన లేదా గమనింపబడిన ఖాతాలు two step ధ్రువీకరణ లేకపోవడం మరియు తక్కువ భద్రత తనిఖీలను స్వీకరిస్తున్నాయని గూగుల్ చెబుతోంది.గూగుల్ యొక్క విశ్లేషణ ప్రకారం ఇలా ఆక్టివ్ గా లేని ఖాతాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా స్కామర్లు మరియు మోసగాళ్లు సులభంగా మోసాలు చేస్తున్నారు.కాబట్టి గూగుల్ సంస్థ వినియోగదారులను రక్షించడం కోసమే ఉపయోగించని ఖాతాలను తొలగిస్తోంది.

జీమెయిల్ ఖాతా తొలగించక ముందే రాబోయే గడువు లోపు లాగిన్ అవ్వడానికి ఇదే మంచి సమయం.పాత ఖాతాలను లాగిన్ చేయడం ద్వారా యాక్టివ్ చేసుకొని ఖాతాలను సురక్షితం చేసుకోవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube