బీట్ రూట్ ( Beetroot )లో ఎన్నో పోషకాలు దాగి ఉన్నాయి.ముఖ్యంగా రక్తహీనతతో బాధపడే వారు బీట్ రూట్ ను( Beetroot Cultivation )( ఎక్కువగా తీసుకుంటారు.
కాబట్టి మార్కెట్లో ఈ పంటకు ఎప్పుడు మంచి డిమాండ్ ఉంటుంది.రైతులు ఈ పంట సాగు విధానంపై అవగాహన కల్పించుకుంటే చీడపీడల ( Pests )నుంచి పంటను సంరక్షించుకుని అధిక దిగుబడి సాధించడానికి వీలు ఉంటుంది.
ఈ బీట్ రూట్ ను బాగు చేయడానికి లోతైన సారవంతమైన నేలలు చాలా అనుకూలం.బరువైన నల్లరేగడి నేలలు ఈ పంట సాగుకు అంత అనుకూలంగా ఉండవు.
అధిక క్షారత ఉండే చౌడు భూములలో కూడా ఈ పంటను సాగు చేయవచ్చు.
ఆగస్టు నుండి నవంబర్ వరకు ఈ పంటను విత్తుకోవచ్చు.ఒక ఎకరాకు దాదాపుగా నాలుగు కిలోల విత్తనాలు అవసరం.మొక్కల మధ్య పది సెంటీమీటర్లు మొక్కల వరుసల మధ్య 45 సెంటీమీటర్ల దూరం ఉంటే గాలి, సూర్యరశ్మి బాగా తగిలి మొక్కలు ఆరోగ్యకరంగా పెరుగుతాయి.
ఈ పంటకు పాముపొడ, ఆకుతినే పురుగులు ఆశించి తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి.వీటిని తొలి దశలో అరికడితేనే అధిక దిగుబడి సాధించడానికి వీలు ఉంటుంది.ఈ చీడపీడలను పొలంలో గుర్తించిన వెంటనే ఒక లీటరు నీటిలో రెండు మిల్లీమీటర్ల డైక్లోరోవాస్ ( Dichlorovas )ను కలిపి పిచికారి చేయాలి.లేదంటే ఒక లీటరు నీటిలో మూడు గ్రాముల కార్బరిల్ ను కలిపి పిచికారి చేయాలి.
తెగుళ్ల విషయానికి వస్తే.మొక్క కుళ్లు తెగుళ్లు, బూజు తెగుళ్లు ఆశించి తీవ్ర నష్టం కలిగిస్తాయి.
వీటి నివారణ కోసం ఒక లీటరు నీటిలో 2గ్రా. డైథేన్ జడ్( Diethane Jud )-78 లీ.ను కలిపి పిచికారి చేయాలి.ఈ పంట 90 రోజులకు చేతికి వస్తుంది.
ఎకరంలో 10 టన్నులకు పైగా దిగుబడి పొందవచ్చు.