దసరా వంటి బ్లాక్ బస్టర్ తర్వాత నాని ( Nani ) మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.దసరా ఇచ్చిన ఊపులో నెక్స్ట్ సినిమాలను సెట్ చేసుకుంటూ ముందుకు వెళుతున్నాడు.
నాని ప్రస్తుతం ”హాయ్ నాన్న”( Hi Nana ) చేస్తున్నాడు.ఇది తన కెరీర్ లోనే బెంచ్ మార్క్ సినిమా 30వ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతుంది.
ఈ సినిమా నుండి టైటిల్ గ్లింప్స్ ను రిలీజ్ చేసినప్పుడే అంచనాలు పెరిగి పోయాయి.ఆ తర్వాత వెంటనే రెండు సాంగ్స్ రిలీజ్ చెయ్యగా చార్ట్ బస్టర్ గా నిలిచాయి.
ఇక ఇటీవలే ఈ సినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేశారు.ఈ టీజర్ క్లీన్ అండ్ బ్యూటిఫుల్ గా ఉండి ఆడియెన్స్ ను ఆకట్టుకుని ఈ సినిమాపై నాని ఫ్యాన్స్ తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ లో కూడా హోప్స్ పెంచేసాయి.
ఇక ఇప్పుడు ఈ సినిమా నుండి మూడవ సాంగ్ ను రిలీజ్ చేసారు.ఈ సాంగ్ మంచి మెలోడియస్ గా ఉంది.నాని, మృణాల్( Nani Mrunal Thakur ) మధ్య పెళ్లి ప్రయాణాన్ని అందంగా చూపించారు.మృణాల్, నాని మధ్య కెమిస్ట్రీ చాలా ఆకట్టుకునేలా ఉంది.
తన భర్తకు మూడో యానివర్సరీ కానుకగా తన భర్తకి ఒక సాంగ్ డేడికేట్ చేస్తూ సాంగ్ స్టార్ట్ అయ్యింది.
హేషం అబ్దుల్ ఈ సాంగ్ కు మంచి వర్క్ అందించాడు.మొత్తానికి నాని సినిమాకు ( Nani )మంచి హైప్స్ అయితే పెంచేస్తూ పోతున్నారు.ఇక ఈ సినిమాలో బేబీ కియారా ఖన్నా( Baby Kiara Khanna ) నాని కూతురు రోల్ పోషిస్తుండగా వైరా ఎంటెర్టైనమెంట్స్ బ్యానర్ పై మోహన్ చెరుకూరి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.
హేషమ్ అబ్దుల్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 7న రిలీజ్ కాబోతుంది.