కాంగ్రెస్ ను దెబ్బకొట్టడమే  'ఎర్ర ' పార్టీల లక్ష్యమా ? బీఆర్ఎస్ హ్యపీనా  ? 

చివరి నిమిషం వరకు గురించి ఊరించి ఉబ్బించి వామపక్ష పార్టీలకు మొండి చేయి చూపించింది తెలంగాణ కాంగ్రెస్.( Telangana Congress ) మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా వామపక్ష పార్టీలు బి ఆర్ ఎస్ తో పొత్తు పెట్టుకున్నాయి.

 Is The Aim Of The 'red' Parties To Damage The Congress Brs Hypena , Brs-TeluguStop.com

వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు ఈ పొత్తు కొనసాగుతుందని అప్పట్లోనే ప్రకటించారు.దీంతో బీఆర్ఎస్ కచ్చితంగా తాము కోరిన స్థానాలు కేటాయిస్తుందని వామపక్ష పార్టీలైన సిపిఐ,  సిపిఎం నేతలు భావించారు.

కానీ ఈ రెండు పార్టీలకు చెప్పకుండానే ఒకేసారి 115 మంది అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను కేసీఆర్( CM kcr ) ప్రకటించడంతో ఆయన తీరుపై వామపక్ష పార్టీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి కాంగ్రెస్ కు దగ్గరయ్యాయి .ఇండియా కూటమిలో కాంగ్రెస్ తో పాటు జాతీయస్థాయిలో పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో తెలంగాణలోనూ పొత్తుకు మార్గం కుదిరింది.ముందుగా చాలా సీట్లను ఆశించినా,  చివరకు సిపిఐ కు రెండు,  సిపిఎం కు రెండు స్థానాలను కేటాయించాలని ఆ పార్టీ లు కాంగ్రెస్ పై  ఒత్తిడి పెంచాయి.

Telugu Chada Venkata, Alliance, Cpi Yana, Munugodu, Revanth Reddy, Telangana-Pol

కానీ కాంగ్రెస్ రెండు పార్టీలకు కలిపి నాలుగు సీట్లు ఇచ్చేందుకు కూడా సిద్ధంగా లేకపోవడంతో , ఆ పార్టీపై తీవ్రస్థాయిలో అసంతృప్తిని వ్యక్తం చేస్తూ సొంతంగానే రెండు పార్టీలు పోటీ చేస్తామని ప్రకటించాయి.ఈ మేరకు  17 స్థానాల్లో సిపిఎం అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది .అంతేకాదు దీనికి తొలి జాబితా అని పేరు పెట్టారు.అంటే మరికొన్ని స్థానాల్లో పోటీ చేసేందుకు రెండో జాబితాను విడుదల చేయబోతున్నారనే విషయం అర్థమైంది.ఇంత ఆకస్మాత్తుగా సిపిఎం ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక కారణాలు చాలానే ఉన్నాయట.

Telugu Chada Venkata, Alliance, Cpi Yana, Munugodu, Revanth Reddy, Telangana-Pol

కాంగ్రెస్ నిర్ణయం కోసం చివరి వరకు వేచి చూసేలా చేసి మోసం చేసింది అని , అందుకే ఆ పార్టీని ఓడించడమే లక్ష్యంగా 17 చోట్ల అభ్యర్థులను పోటీకి దించడం తో పాటు,  మరికొన్ని స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టి ఆ పార్టీని దెబ్బ కొట్టాలనే లక్ష్యం పెట్టుకున్నట్లుగా కనిపిస్తున్నాయి.అయితే తెర వెనుక బీఆర్ఎస్ పార్టీ( BRS party )తో లోపాయికర ఒప్పందం జరిగిందని,  ఆ ఒప్పందం మేరకు ఇప్పుడు ఎన్నికల్లో సిపిఐ,  సిపిఎంలు( CPI, CPMs ) తమ పార్టీ తరఫున అభ్యర్థులను నిలబెట్టి కాంగ్రెస్ ను దెబ్బ కొట్టాలని లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాయనే అనుమానాలు రాజకీయ వర్గాల్లో కలుగుతున్నాయి.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube