కాంగ్రెస్ ను దెబ్బకొట్టడమే  ‘ఎర్ర ‘ పార్టీల లక్ష్యమా ? బీఆర్ఎస్ హ్యపీనా  ? 

చివరి నిమిషం వరకు గురించి ఊరించి ఉబ్బించి వామపక్ష పార్టీలకు మొండి చేయి చూపించింది తెలంగాణ కాంగ్రెస్.

( Telangana Congress ) మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా వామపక్ష పార్టీలు బి ఆర్ ఎస్ తో పొత్తు పెట్టుకున్నాయి.

వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు ఈ పొత్తు కొనసాగుతుందని అప్పట్లోనే ప్రకటించారు.దీంతో బీఆర్ఎస్ కచ్చితంగా తాము కోరిన స్థానాలు కేటాయిస్తుందని వామపక్ష పార్టీలైన సిపిఐ,  సిపిఎం నేతలు భావించారు.

కానీ ఈ రెండు పార్టీలకు చెప్పకుండానే ఒకేసారి 115 మంది అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను కేసీఆర్( CM Kcr ) ప్రకటించడంతో ఆయన తీరుపై వామపక్ష పార్టీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి కాంగ్రెస్ కు దగ్గరయ్యాయి .

ఇండియా కూటమిలో కాంగ్రెస్ తో పాటు జాతీయస్థాయిలో పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో తెలంగాణలోనూ పొత్తుకు మార్గం కుదిరింది.

ముందుగా చాలా సీట్లను ఆశించినా,  చివరకు సిపిఐ కు రెండు,  సిపిఎం కు రెండు స్థానాలను కేటాయించాలని ఆ పార్టీ లు కాంగ్రెస్ పై  ఒత్తిడి పెంచాయి.

"""/" / కానీ కాంగ్రెస్ రెండు పార్టీలకు కలిపి నాలుగు సీట్లు ఇచ్చేందుకు కూడా సిద్ధంగా లేకపోవడంతో , ఆ పార్టీపై తీవ్రస్థాయిలో అసంతృప్తిని వ్యక్తం చేస్తూ సొంతంగానే రెండు పార్టీలు పోటీ చేస్తామని ప్రకటించాయి.

ఈ మేరకు  17 స్థానాల్లో సిపిఎం అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది .

అంతేకాదు దీనికి తొలి జాబితా అని పేరు పెట్టారు.అంటే మరికొన్ని స్థానాల్లో పోటీ చేసేందుకు రెండో జాబితాను విడుదల చేయబోతున్నారనే విషయం అర్థమైంది.

ఇంత ఆకస్మాత్తుగా సిపిఎం ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక కారణాలు చాలానే ఉన్నాయట.

"""/" / కాంగ్రెస్ నిర్ణయం కోసం చివరి వరకు వేచి చూసేలా చేసి మోసం చేసింది అని , అందుకే ఆ పార్టీని ఓడించడమే లక్ష్యంగా 17 చోట్ల అభ్యర్థులను పోటీకి దించడం తో పాటు,  మరికొన్ని స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టి ఆ పార్టీని దెబ్బ కొట్టాలనే లక్ష్యం పెట్టుకున్నట్లుగా కనిపిస్తున్నాయి.

అయితే తెర వెనుక బీఆర్ఎస్ పార్టీ( BRS Party )తో లోపాయికర ఒప్పందం జరిగిందని,  ఆ ఒప్పందం మేరకు ఇప్పుడు ఎన్నికల్లో సిపిఐ,  సిపిఎంలు( CPI, CPMs ) తమ పార్టీ తరఫున అభ్యర్థులను నిలబెట్టి కాంగ్రెస్ ను దెబ్బ కొట్టాలని లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాయనే అనుమానాలు రాజకీయ వర్గాల్లో కలుగుతున్నాయి.

.

వీడియో వైరల్: ముద్దులతో రెచ్చిపోయిన కొత్తజంట.. మరి ఇంతలా.?