గత కొంతకాలంగా ఎదురుచూస్తున్నటువంటి కాంగ్రెస్(congress) పార్టీ మొదటి జాబితా ఈరోజు విడుదలైంది.ఎలాంటి వివాదాలు లేనటువంటి నియోజకవర్గాల్లో మొదటి జాబితాను విడుదల చేశారు.
మొత్తం 55 మంది అభ్యర్థులు జాబితాలో ఉన్నారు.ఈ జాబితాను పూర్తిగా గమనిస్తే.
తప్పనిసరిగా గెలిచే నియోజకవర్గాలే ప్రకటించినట్లు తెలుస్తోంది.ముఖ్యంగా ఈ జాబితా గమనిస్తే 11 మంది ఎస్సీ స్థానాలను, రెండు ఎస్టీ స్థానాలు, మొత్తం తొమ్మిది మంది బీసీ(BC) స్థానాలను కేటాయించారు.
ఇందులో మరొకటి గమనించాల్సిన విషయం ఏమిటంటే 12 మంది కొత్తగా పార్టీలో చేరిన వారికి ఈ జాబితాలో అవకాశం కల్పించారు.ఈ విధంగా మొదటి జాబితాలో పేర్లు వచ్చిన చాలామంది నేతలు ఊపిరి పీల్చుకున్నారు.
ఇక ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మొదటి జాబితాలో బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరినటువంటి మైనంపల్లి హనుమంతరావుకు(Mynampally Hanumantha Rao) మరియు తన కొడుకుకు కూడా సీటు దక్కింది.
ఎంతో ఉత్కంఠ గా సాగే నకిరేకల్ నియోజకవర్గం నుంచి వేముల వీరేశంకు( Vemula Viresham ) సీటు దక్కింది అని చెప్పవచ్చు.ఇక మరో ట్విస్ట్ ఏంటంటే ప్రస్తుతం ఎంపీలుగా కొనసాగుతున్నటువంటి రేవంత్ రెడ్డి(Revanth Reddy), కోమటిరెడ్డి వెంకటరెడ్డి(Komatireddy Venkatreddy), ఉత్తంకుమార్ రెడ్డిలకు(Uttam Kumar Reddy) మొదటి జాబితాలోనే పేర్లు వచ్చాయి.గత కొంతకాలంగా కాంగ్రెస్ నుంచి రెండు టికెట్లు కావాలని పట్టుబట్టిన జానారెడ్డికి మొండి చేయి చూపించారు.
కేవలం తన కుమారుడికి మాత్రమే నాగార్జునసాగర్ లో సీటు కేటాయించినట్లు తెలుస్తోంది.
ఇందులో మరో గమనించాల్సిన విషయం ఏమిటంటే గజ్వేల్ నుంచి నర్సారెడ్డి(Narsareddy) బరిలో ఉంటున్నారు.గత కొంతకాలంగా బిసి సీట్ల కోసం కొట్లాడుతున్నటువంటి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) హుస్నాబాద్ సీట్ కోసం కొట్లాడుతున్నారు.కానీ మొదటి జాబితాలో ఆయన పేరు రాలేదు.
ఈ విధంగా మొదటి లిస్టులో 55 మంది గెలుపు గుర్రాలను కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టడంతో కాస్త జోష్ పెరిగిందని చెప్పవచ్చు.