నేటి యువతని సమూలంగా నాశనం చేసే అలవాట్లు ఇవే!

ప్రస్తుతం ప్రపంచంలో అత్యధిక జనాభాగల దేశం మన భారత దేశం. ఇందులో ఎక్కువశాతం వున్నది మన యువతే.

 These Are The 5 Habits That Destroy Youth Details, Habits, Destroy Youth, Latest-TeluguStop.com

కానీ దానికి మనం సంతోషించాలో ఏడవాలో తెలియని పరిస్థితి వుంది.ఎందుకంటే అదే యువత( Youth ) దేశానికి బలంగా మారాల్సింది పోయి, బలహీనంగా తయారయ్యారు.

మొన్నటికి మొన్న మన పొరుగుదేశం చైనా ఆ విషయంలో మనపై గట్టి సెటైర్ కూడా వేసింది… “సత్తువలేని మనుషులు ఎంత పెరిగితే ఏంటని?” అవును, ఆమాట వినగానే మనసు చివుక్కుమన్నా అదే ఋజువు చేస్తున్నారు మన నేటి తరం.మనలో చాలామంది వారికి తెలిసో, తెలియాకో లైఫ్‌ డ్యామేజ్‌ చేసే తప్పులను చేస్తూ ఉంటారు.తాజా సర్వేలే ఆ భయంకర విషయాలను వెల్లడించాయి.

Telugu Bad Habits, Bath Hot, Destroy, Excess, Habits, India, Latest, Latest Surv

మన ఆలోచనలే మన భవిష్యత్తుని నిర్దేశిస్తాయి అని ఇక్కడ వేరే చెప్పాల్సిన పనిలేదు.కొందరు తరచూ “పోర్న్‌ వీడియోస్‌” చూస్తూ ఉంటారు.ఇలాంటి వీడియోలు చూడడం వల్ల క్రియేటివిటీ లెవెల్స్‌ బాగా తగ్గిపోతాయి.

అంతేకాకుండా డిప్రెషన్, యాంగ్జెటీ అనేది పెరుగుతుంది.అప్పుడప్పుడు ఈ పోర్న్‌ వీడియోస్‌ చూడడం వల్ల ఎలాంటి ప్రాబ్లం ఉండదుకానీ డైలీ చూస్తే మాత్రం మీరు తొందరగా ఈ హ్యాబిట్‌ ని మానేయడం వుత్తమం.

అదేవిధంగా మనలో చాలామంది ఎక్కువగా వేడినీళ్లతో స్నానం( Hotwater Bath ) చేస్తూ వుంటారు.హాట్‌ వాటర్‌ అనేది చర్మాన్ని డ్యామేజ్‌ చేస్తుంది.

అంతేకాకుండా హెయిర్‌ని కూడా డ్యామేజ్‌ చేస్తుంది అనే సంగతి మర్చిపోతారు.అయితే వేడినీళ్లతో పూర్తిగా చేయకూడదనికాదు, అవసరం అయినపుడు చేయవచ్చు.

Telugu Bad Habits, Bath Hot, Destroy, Excess, Habits, India, Latest, Latest Surv

అదేవిధంగా మనలో ఎక్కువ మంది దీర్ఘకాలం నిద్రపోతూ వుంటారు.అలా ఎక్కువసేపు పడుకుంటే( Excess Sleep ) మంచి రిలాక్సేషన్‌ వస్తుందని అనుకుంటారు.కానీ స్టడీస్‌లో ప్రూవ్‌ అయింది ఏమిటంటే లాంగ్‌ టైం స్లీపింగ్‌ పోవడం వల్ల డయాబెటిక్, హార్ట్ ఎటాక్ వంటి వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట.జనరల్‌గా ఒక మనిషికి 8 గంటల నుంచి 9 గంటల వరకు నిద్ర అనేది ప్రతి ఒక్కరికీ హెల్దీగా ఉండటానికి సరిపోతుంది.

అంతకంటే ఎక్కువ నిద్ర అనేది మీ కొంప ముంచుతుంది.అదేవిధంగా మొబైల్‌ అడిక్షన్‌ అనేది ఈ రోజుల్లో చాలా కామన్‌ అయింది.మొబైల్‌ ( Mobile ) ఎక్కువగా వాడటం అనేది కళ్లకు ముప్పుగా మారుతుంది.సమయం ఎలాగూ వృధా అవుతుంది.

ఇలాంటి బ్యాడ్‌ హ్యాబిట్స్‌ ని మానేసి మీ లైఫ్‌ని మరింత బెటర్‌గా హ్యాపీగా మార్చుకోండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube