బాబు కి తోడుగా...ఒక నియంతపై పోరాటం కోసం మేము సైతం

-ఆవునూరి దయాకర్ రావు.టీడీపీ సిరిసిల్ల నియోజకవర్గ ఇంఛార్జి.

 Along With Babu...we Are Also For Fighting Against A Dictator-TeluguStop.com

రాజన్న సిరిసిల్ల జిల్లా: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు,మాజీ ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు( Nara chandrababu Naidu ) ని అక్రమ అరెస్ట్,రిమాండ్ ని నిరసిస్తూ ఈరోజు సిరిసిల్ల నియోజకవర్గ ఇంఛార్జి ఆవునూరి దయాకర్ రావు ( Avunoori Dayakar Rao )ఆధ్వర్యంలో చేనేత విగ్రహం నుండి గాంధీ విగ్రహం మీదుగా అంబెడ్కర్ విగ్రహం వరకు సంఘీభావ ర్యాలీ నిర్వహించారు.అనంతరం అంబెడ్కర్ విగ్రహానికి జగన్ కి బుద్ది ప్రసాదించి బాబు మీద పెట్టిన అక్రమ కేసులు ఎలాంటి షరతులు లేకుండా ఎత్తివేయాలని వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి కక్ష్య సాదింపులో భాగంగానే బాబు ని అక్రమ కేసులో అరెస్ట్ చేసి జైల్లో పెట్టారని ఇప్పటికైనా జగన్ ప్రభుత్వం బాబు మీద పెట్టిన కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.కేటీఆర్ ఆంద్రప్రదేశ్ లో బాబు అరెస్ట్ అయితే తెలంగాణలో ర్యాలీలు చేయడం అవసరమా అనడం సిగ్గు చేటని తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీ అని తెరాస ని బిఆర్ఎస్ గా మార్చి దేశం మొత్తం సభలు పెట్టుకుంటూ మీరు దేశం మొత్తం ఎలా తిరుగుతున్నారు అని ప్రశ్నించారు.

కేటీఆర్ సీనియర్ ఎన్టీఆర్( KTR ) పేరును ఎలక్షన్లో వాడుకుంటూ పబ్బం గడుపుతున్నా మీకు రానున్న ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు మీకు తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కరీంనగర్ పార్లమెంట్ అధ్యక్షులు వంచ శ్రీనివాస్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు తీగల శేఖర్ గౌడ్, వేములవాడ ఇంఛార్జి పులి రాంబాబు గౌడ్, టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు పర్లపల్లి రవీందర్, టీఎన్ఎస్ఎఫ్ కరీంనగర్ పార్లమెంట్ అధ్యక్షులు మోతె రాజిరెడ్డి,శ్యాగ ప్రశాంత్,జంగం అంజయ్య, మచ్చ ఆంజనేయులు,కడారి రాంరెడ్డి, నారాయణ గౌడ్,పెడ్తనపల్లి రాములు,రాములు తదితరులు పాల్గొన్నారు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube