Saba Azad : ఆ విమర్శలు తట్టుకోవడానికి నాకు చాలా సమయం పట్టింది.. సబా ఆజాద్ కామెంట్స్ వైరల్?

బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్( Hrithik roshan ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.బాలీవుడ్( Bollywood ) లో ఎన్నో సినిమాలలో నటించి స్టార్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు హృతిక్ రోషన్.

 Saba Azad On Receiving Hate Says It Hits You-TeluguStop.com

ఒక వైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు కమర్షియల్ యాడ్స్ లో నటిస్తూ బాగానే సంపాదిస్తున్నారు.తరచూ ఏదో ఒక విషయంతో వార్తల్లో నిలుస్తూ ఉంటారు హృతిక్ రోషన్.

ఈ నేపథ్యంలోనే తాజాగా ఈయన పేరు సోషల్ మీడియాలో మారుమోగుతోంది.నటి ఆజాద్‌ తాజాగా నటుడు హృతిక్ రోషన్ తో రిలేషన్షిప్ విషయం గురించి స్పందించింది.

Telugu Bollywood, Hrithik Roshan, Relationship, Saba Azad-Movie

ఈ సందర్భంగా ఇంటర్వ్యూలో భాగంగా ఆమె మాట్లాడుతూ.తమ రిలేషన్‌షిప్‌ విషయంలో చాలామంది తనని ట్రోల్‌ చేశారని తెలిపారు.వాళ్ల విమర్శల వల్ల తాను ఎంతో బాధపడ్డానని అన్నారు.ఎదుటివ్యక్తుల విమర్శలు తట్టుకోవడానికి నాకు చాలా సమయం పట్టింది.ఎందుకంటే నేనేమీ రాయిని కాదు.వాళ్ల మాటలు నా మనసుకు గట్టిగా తాకాయి.

ట్రోలింగ్స్‌ చూసి.నేను మీకు ఏం అన్యాయం చేశాను? నా జీవితం నాది.అలాగే మీరు కూడా మీ లైఫ్‌ను లీడ్‌ చేయొచ్చు కదా అని చెప్పాలనిపించేది.కొన్నిరోజులు గడిచాక. ఎదుటివాళ్ల మాటలను పట్టించుకోకూడదని అర్థమైంది.

Telugu Bollywood, Hrithik Roshan, Relationship, Saba Azad-Movie

ట్రోల్స్‌ను పట్టించుకోవడం మానేశాను.అలా, కాస్త ప్రశాంతంగా ఉంటున్నాను అని సబా ఆజాద్‌( Saba Azad ) చెప్పుకొచ్చింది.కాగా బాలీవుడ్‌ నటుడు హృతిక్‌ రోషన్‌, నటి సబా ఆజాద్‌ రిలేషన్‌లో ఉన్నారంటూ గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి.

అయితే వీరిద్దరూ తమ ప్రేమ గురించి ఎక్కడా మాట్లాడలేదు.కానీ, సామాజిక మాధ్యమాల వేదికగా పరస్పరం ప్రేమను వ్యక్తపరచుకున్నారు.వయసులో తనకంటే 12 ఏళ్లు పెద్దవాడితో ప్రేమలో ఉండటంపై సబాని పలువురు ట్రోల్‌ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube