అమెరికా అధ్యక్ష ఎన్నికలు .. ట్రంప్ రన్నింగ్‌‌మేట్‌గా ఉండను : తేల్చేసిన డిసాంటిస్

2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌( Donald Trump )కు తాను రన్నింగ్‌మేట్‌గా వుండబోనన్నారు రిపబ్లికన్ నేత, ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిసాంటిస్( Ron DeSantis )రిపబ్లికన్ పార్టీ నుంచి ఆయన అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన సంగతి తెలిసిందే.ఫాక్స్ న్యూస్ సండే మార్నింగ్ ఫ్యూచర్స్‌లో ఆయన మాట్లాడుతూ.

 Ron Desantis Says He Wouldn’t Be Donald Trump’s 2024 Running Mate If Offered-TeluguStop.com

తాను అధ్యక్ష పదవికి మాత్రమే పోటీ చేస్తున్నానని స్పష్టం చేశారు. రిపబ్లికన్ పార్టీ నామినేషన్స్‌లో ముందంజలో వున్న ట్రంప్ .డెట్రాయిట్‌లో సమ్మె చేస్తున్న ఆటో వర్కర్స్‌‌తో తాను ఉద్యోగానికి వ్యతిరేకంగా పోటీ చేస్తున్నానని చెప్పడంతో డిసాంటిస్ ఈ ప్రశ్నను ఎదుర్కొన్నారు.

Telugu Calinia, Donald Trump, Floridagovernor, Nikki Haley, Joe Biden, Ron Desan

రిపబ్లికన్ ప్రైమరీ డిబేట్‌లకు దూరంగా వుండాలన్న ట్రంప్ నిర్ణయాన్ని విమర్శించిన రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధుల్లో డిసాంటిస్ కూడా వున్నారు.నవంబర్‌లో డిసాంటిస్, కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసోమ్ మధ్య జరిగే చర్చల మాదిరిగానే ట్రంప్‌తోనూ చర్చలకు సవాల్ విసిరారు ఫ్లోరిడా గవర్నర్.గతవారం అనాహైమ్‌లో జరిగిన కాలిఫోర్నియా స్టేట్ రిపబ్లికన్ కన్వెన్షన్‌లో ట్రంప్, డిసాంటిస్‌లు ద్వంద్వ ప్రసంగాలు చేశారు.

అధ్యక్ష ఎన్నికల్లో రాష్ట్ర విలువను ఎత్తిచూపారు.మరోవైపు పోల్ నెంబర్స్, సర్వేల్లో వెనుకంజలో వున్నట్లు తేలడంతో డిసాంటిస్ .డోనర్స్, ఓటర్ల నుంచి మరింత మద్ధతును కూడగట్టాలని భావిస్తున్నారు.రియల్ క్లియర్ పాలిటిక్స్‌ చేసిన సర్వేలో జీవోపీ ప్రైమరీ రేసులో ట్రంప్ కంటే దాదాపు 44 శాతం పాయింట్ల మేర వెనుకబడి వున్నారు డిసాంటిస్.

ఈ నేపథ్యంలో తన ప్రారంభ ప్రైమరీ స్టేట్ అయోవాపై ఆయన ఫోకస్ పెట్టారు.

Telugu Calinia, Donald Trump, Floridagovernor, Nikki Haley, Joe Biden, Ron Desan

కాగా.అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి సెకండ్ జీవోపీ డిబేట్ కాలిఫోర్నియనాలోని సిమి వ్యాలీలో వున్న రోనాల్డ్ రీగన్ ప్రెసిడెన్షియల్ లైబ్రరీలో నిర్వహించారు.ఈ చర్చా కార్యక్రమంలో ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఏడుగురు రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధులు హాజరయ్యారు.

నార్త్ డకోటా గవర్నర్ డౌగ్ బర్గమ్, న్యూజెర్సీ మాజీ గవర్నర్ క్రిస్ క్రిస్టీ, ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిసాంటిస్, ఐక్యరాజ్యసమితి మాజీ రాయబారి నిక్కీ హేలీ( Nikki Haley ), మాజీ వైస్ ప్రెసిడెంట్ మైక్ పెన్స్, భారత సంతతి వ్యాపారవేత్త వివేక్ రామస్వామి, సౌత్ కరోలినా సెనేటర్ టిమ్ స్కాట్ పాల్గొన్నారు.అయితే ఈ డిబేట్‌కు కూడా మాజీ అధ్యక్షుడు <డొనాల్డ్ ట్రంప్గై ర్హాజరయ్యారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube