తలైవర్ ఆశీస్సులు తీసుకున్న లారెన్స్.. చంద్రముఖి 2 హిట్ అవుతుందా?

సౌత్ ఇండస్ట్రీలో తెరకెక్కుతున్న సీక్వెల్స్ లో ‘చంద్రముఖి 2’( Chandramukhi 2 ) ఒకటి.ఈ సినిమా రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

 Raghava Lawrence Takes Blessings From Rajinikanth, Raghava Lawrence, Rajinikanth-TeluguStop.com

దాదాపు 17 ఏళ్ల క్రితం వచ్చిన చంద్రముఖి సినిమా ఎంత హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.రజనీకాంత్( Rajinikanth ) కెరీర్ లో మరపురాని సినిమాలలో చంద్రముఖి ఒకటి.2005 లో రిలీజ్ అయిన ఈ సినిమా తమిళ్ తో పాటు తెలుగు భాషలో కూడా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది.

మరి రజినీకాంత్ తోనే సీక్వెల్ కూడా తీయాలని ప్లాన్ చేసిన కూడా రజినీకాంత్ సుముఖంగా లేకపోవడంతో ఇన్నాళ్లు దీని సీక్వెల్ అటకెక్కింది.

ఇక ఇప్పటికి సీక్వెల్ కు ముహూర్తం కుదిరి మళ్ళీ సెట్స్ మీదకు వెళ్లి పూర్తి చేసారు.అయితే ఈసారి రాఘవ లారెన్స్( Raghava Lawrence ) మెయిన్ రోల్ లో నటించగా ఈయనకు జోడీగా కంగనా రనౌత్ హీరోయిన్ గా నటించడంతో ఈ సినిమాపై బాలీవుడ్ లో సైతం అంచనాలు పెరిగాయి.

మరి ఈ సినిమా సెప్టెంబర్ 28న రిలీజ్ కానున్న నేపథ్యంలో లారెన్స్ సూపర్ స్టార్ రజినీకాంత్ ఆశీస్సులు అందుకోవడానికి ఆయనను మీట్ అయ్యారు.ఈ సినిమా స్టార్ట్ చేసే ముందు కూడా లారెన్స్ రజినీకాంత్ ను కలిసి ఆశీస్సులు తీసుకున్నారు.ఇక ఇప్పుడు రిలీజ్ ముందు కూడా ఆయనను కలిసి బ్లెస్సింగ్స్ అందుకున్నారు.ఈ బ్యూటిఫుల్ మూమెంట్ కు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేయగా అవి వైరల్ అవుతున్నాయి.

మరి సూపర్ హిట్ కు సీక్వెల్ గా తెరకెక్కిన చంద్రముఖి 2 ఎలాంటి హిట్ అందుకుంటుందో చూడాలి.కాగా ఈ సినిమాను పి వాసు( P Vasu ) డైరెక్ట్ చేయగా ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ సంస్థ భారీ స్థాయిలో పాన్ ఇండియన్ మూవీగా నిర్మించారు.ఇన్నేళ్ల తర్వాత సీక్వెల్ గా చంద్రముఖి 2 రాబోతుంది అని తెలియడంతో చంద్రముఖి ఫ్యాన్స్ ఎగ్జైట్ గా ఎదురు చూస్తున్నారు.ఎంతో గ్రాండ్ గా నిర్మిస్తున్న ఈ సినిమాకు ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube