ఏపీపీఎస్సీ 2022 ప్రకటించిన గ్రూప్1( Appsc group1 ) ఫలితాలు తాజాగా విడుదలైన సంగతి తెలిసిందే.ఈ ఫలితాలలో అనంతపురం జిల్లా బెళుగుప్ప గ్రామానికి చెందిన కవిరాజ్ ఎంపీడీఓ జాబ్ కు ఎంపిక కావడం గమనార్హం.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కవిరాజ్ ( kaviraj )తన సక్సెస్ స్టోరీకి సంబంధించిన షాకింగ్ విషయాలను చెప్పుకొచ్చారు.మా తల్లీదండ్రులకు, నేను, చెల్లి సంతానమని కారంపొడి, పిండి మిషన్ లను నిర్వహించడం ద్వారా కుటుంబం జీవనం సాగించిందని కవిరాజ్ అన్నారు.
పుట్టుకతో నేను ఆరోగ్యవంతుడినని అయితే ఒకానొక సమయంలో వచ్చిన తీవ్ర జ్వరం వల్ల శారీరక బలహీనత ప్రారంభమైందని కవిరాజ్ వెల్లడించారు.శారీరక బలహీనత వల్ల నేను దివ్యాంగుడిగా మారానని కవిరాజ్ పేర్కొన్నారు.
అమ్మానాన్న నా ఆరోగ్యం కోసం లక్షల రూపాయలు ఖర్చు చేశారని ఆయన కామెంట్లు చేశారు.సెయింట్ జాన్స్ ఆస్పత్రిలో చికిత్స చేయించడం వల్ల ప్రాణాపాయం నుంచి కాపాడుకోగలిగారని కవిరాజ్ పేర్కొన్నారు.
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదివి పదో తరగతిలో మండల టాపర్ గా నిలిచానని ఆయన కామెంట్లు చేశారు.ఉన్నత విద్యకు ఇబ్బందులు ఎదురైన సమయంలో అనంతపురంలోని ఆర్డీటీ అనే సేవా సంస్థ 12 లక్షల రూపాయల వైద్య సాయం అందిందని కవిరాజ్ వెల్లడించారు.ఎన్నో వివక్షలు ఎదుర్కొని డీఎస్సీ 2012లో ఓపెన్ కేటగిరీలో సెలెక్ట్ అయ్యానని కవిరాజ్ కామెంట్లు చేశారు.
ఆ తర్వాత ఎంతో కష్టపడి గ్రూప్1 ఎంపీడీవోగా ఎంపికయ్యానని కవిరాజ్ వెల్లడించారు.ప్రస్తుతం జాబ్ చేస్తూనే హిస్టరీలో పీహెచ్డీ చేస్తున్నానని ఇంకా కష్టపడి చదివి డిప్యూటీ కలెక్టర్( Deputy Collector ) పదవి సాధించి నా సేవల పరిధిని మరింత పెంచుకోవాలని భావిస్తున్నానని తెలిపారు.కవిరాజ్ సక్సెస్ స్టోరీ ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తుందని చెప్పవచ్చు.
తన లోపాలను అధిగమించి ప్రతిభతో కవిరాజ్ కెరీర్ పరంగా ఊహించని స్థాయిలో సక్సెస్ సాధించడం గమనార్హం.