కస్సుమన్న నేతలు కామ్ అయ్యారు ! కేసీఆర్ ఏం మంత్రమేశారో... ? 

తమకు టిక్కెట్ దక్కలేదని, తమ వారసులకి టికెట్ దక్కలేదనే అసంతృప్తితో బీఆర్ఎస్( BRS ) అధిష్టానం పైనే యుద్ధం ప్రకటించినా, ఆ పార్టీ నాయకులు ఇప్పుడు పూర్తిగా సైలెంట్ అయిపోయినట్టుగా కనిపిస్తున్నారు.కొద్దిరోజుల క్రితమే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి 115 మంది అభ్యర్థుల జాబితాను కేసీఆర్ ప్రకటించారు.

 Swearing Leaders Have Come What Magic Did Kcr , Mainampalli Hanumanthrao, Mal-TeluguStop.com

ఆ ప్రయత్నం తర్వాత , బీఆర్ఎస్ లో అలకలు, అసంతృప్తుల వ్యవహారం పెద్ద సంచలనమే రేపింది.  కొంతమంది టిక్కెట్ దక్కకపోవడంతో, కొంతమంది పార్టీ మారిపోగా,  మరి కొంత మంది రకరకాల కారణాలతో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు .మరి కొంతమంది చివరి నిమిషంలోనైనా అభ్యర్థుల జాబితాలో మార్పు చేర్పులు జరిగి తమ పేరు ప్రకటిస్తారని ఆశలు పెట్టుకోగా,  మరికొంతమంది కెసిఆర్ , కేటీఆర్( KTR ) కు అత్యంత సన్నిహితుల ద్వారా టికెట్ మంతనాలు జరిపారు.ఈ అసంతృప్తుల వ్యవహారం పార్టీ పుట్టి ముంచే అవకాశం కనిపించడంతో,  బీఆర్ఎస్ అధిష్టానం రంగంలోకి దిగింది.

Telugu Kadiyam Srihari, Malkajgiri Mla, Rajayya-Politics

అసంతృప్త నాయకులను బుజ్జగించే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది.దీనిలో భాగంగానే పార్టీలోని కీలక నేతలు కొంతమందికి ఈ బాధ్యతలను కేసీఆర్ ,( CM kcr ) కేటీఆర్ కు అప్పగించారు.కెసిఆర్ అభ్యర్థుల జాబితాను ప్రకటించిన తర్వాత టికెట్లు రాని ఉప్పల్, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే తో చర్చలు జరిపారు .  ఇక మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు వంటి వారు పార్టీని విడబోతున్నారనే హడావుడి ఎప్పటి నుంచో.జరుగుతుంది.అనుకున్నట్టుగానే ఆయన బీఆర్ ఎస్  కు రాజీనామా చేశారు.ఇక స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే రాజయ్య  అలకవీడగా,  మిగతావారు అదే బాటలో ఉన్నట్లు సమాచారం.టికెట్ దక్కకపోవడంతో ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.

కనీసం అధిష్టానం పిలిచి మాట్లాడకపోవడంపై , ఆయన ఆవేదన చెందారు.

Telugu Kadiyam Srihari, Malkajgiri Mla, Rajayya-Politics

15 రోజులు పాటు నియోజకవర్గంలో తిరిగి ప్రజల అభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకుంటానని మీడియా సమావేశం నిర్వహించి మరీ చెప్పారు .అయితే ఆకస్మాత్తుగా ఆయన అలక వీడి ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో ఉప్పల్ ఎమ్మెల్యే హోదాలో ఆయన పాల్గొనడంతో ఆయనను అధిష్టానం బుజ్జగించినట్లు ప్రచారం జరుగుతుంది.

ఇక మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు( Mainampalli hanumanthrao, )కు టికెట్ దక్కినా, ఆయన కుమారుడు రోహిత్ కు టికెట్ దక్కకపోవడంతో మైనంపల్లి ప్రజల్లో తిరిగి నిర్ణయం తీసుకుంటానని,  అవసరమైతే పార్టీ మారేందుకు కూడా సిద్ధం ఉన్నట్లుగా ప్రకటనలు ఇచ్చారు.అయితే ఇప్పుడు ఆయన సైలెంట్ అయినట్టుగానే కనిపిస్తున్నారు.

ఇక స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే విషయానికొస్తే ఆయన అలక లీడర్ కి ఇవ్వడంతో అలక చెందిన రాజయ్య మంత్రి కేటీఆర్ జోక్యంతో సైలెంట్ అయిపోయారు.ప్రస్తుతం కడియం శ్రీహరి( Kadiyam Srihari ) ఎమ్మెల్సీ ఇచ్చి రాజయ్యను బుజ్జగించే విధంగా కేటీఆర్ ఒప్పించినట్లు సమాచారం.

అలా కాని పక్షంలో ఎంపీగా పోటీ చేసే అవకాశం ఇస్తానని కేటీఆర్ హామీ ఇచ్చారట.దీంతో రాజయ్య అలక వీడి కడియం శ్రీహరి విజయానికి తాను కృషి చేస్తానని రాజయ్య ప్రకటించడంతో , ఇక్కడ వ్యవహారం సర్ధుమనిగింది.

ఇదేవిధంగా మిగతా అసంతృప్త నాయకులు మెట్టబడినట్టు గానే పరిస్థితి కనిపిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube